`దసరా` అసలు కథేంటనేది ఆసక్తికరంగా మారింది. టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ఏం చెప్పబోతున్నారనేది ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. దీనికితోడు ఇందులో సిల్క్ స్మిత ఫోటోని ఉపయోగించడం మరింత హాట్‌ టాపిక్‌ అవుతుంది.

నేచురల్‌ స్టార్‌ నాని(Nani) తన పంథా మార్చి చేస్తున్న సినిమా `దసరా`(Dasara). తెలంగాణలోని సింగరేణి నేపథ్యంలో సాగే రా అండ్‌ రస్టిక్‌ ఫిల్మ్. పూర్తి ఊరమాస్‌ లుక్‌లో సినిమా సాగబోతుండటం విశేషం. ఇటీవల విడుదలైన టీజర్‌ ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది. శ్రీకాంత్‌ ఓడెల అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం మార్చి 30న సమ్మర్‌ స్పెషల్‌గా రాబోతుంది. ఓ రకంగా సమ్మర్‌ని గ్రాండ్‌గా స్టార్ట్ చేయడానికి రానుంది. 

ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమాకి సంబంధించి పెద్ద చర్చే నడిచింది. `దసరా` టీజర్‌లోని నాని వాడిన బాంఛత్‌ అనే పదం వివాదంగా మారింది. సినిమాలో వాడటం వివాదం కాలేదు కానీ, ప్రెస్‌మీట్‌లో నాని దాన్ని సమర్ధించడం వివాదంగా మారింది. తెలంగాణ స్టయిల్‌లో, ఆ పదాన్ని ఏ అర్థంలో వాడతారో అలానే తీసుకోవాలని, ఒరిజినల్‌ మీనింగ్‌ తీసుకోవద్దన్నారు. అంతేకాదు దాన్ని వాడాలని చెప్పి సమర్థించడం పట్ల అంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇది సినిమాకి మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. 

ఇదిలా ఉంటే `దసరా` అసలు కథేంటనేది ఆసక్తికరంగా మారింది. టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ఏం చెప్పబోతున్నారనేది ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. దీనికితోడు ఇందులో సిల్క్ స్మిత ఫోటోని ఉపయోగించడం మరింత హాట్‌ టాపిక్‌ అవుతుంది. పీరియాడికల్‌ స్టోరీగా అప్పటి సన్నివేశాలను ఏదైనా చూపించబోతున్నారా? అనే ఆసక్తి నెలకొంది. అయితే సినిమా మాత్రం పీరియాడికల్‌ నేపథ్యంలోనే సాగుతందని తెలుస్తుంది. 

దీంతోపాటు `దసరా` స్టోరీకి సంబంధించిన ఓ లీక్‌ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఇది ఓ సిల్క్ స్మిత పేరుతో ఉన్న ఓ బార్‌ రెస్టారెంట్‌ కేంద్రంగా సినిమా సాగుతుందట. అందులో నానితోపాటు మరో గ్యాంగ్‌ కూడా రెగ్యూలర్‌గా వచ్చిపోతుంటారట. అయితే అందులో వీరి రెండు గ్రూపులకు మధ్య గొడవ జరుగుతుందని, దీనికి కారణంగా అంతా రెండుగా విడిపోయి కొట్టుకుంటుంటారని, మరి ఆ గొడవేంటి? ఎందుకు గొడవ పడ్డారు, అందులో స్కిల్ స్మిత్‌ హోటల్‌ పాత్ర ఏంటి? నాని ఏం చేశాడనేది కథగా ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

సినిమా మాత్రం ఈ ఏడాది నిలిచిపోయే చిత్రంలా ఉంటుందన్నారు నాని. దర్శకుడు శ్రీకాంత్‌ పేరు మరో పదేళ్ల పాటు వినిపిస్తూనే ఉంటుందన్నారు. ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌ మూవీగా చెప్పారు. అయితే ఈ సినిమాకి బడ్జెట్‌ అనుకున్నదానికి డబుల్‌ అయ్యిందట. మొదట 35నుంచి 40వరకు ఎస్టిమేట్‌ చేశారని, కానీ సుమారు 65కోట్లు అయ్యిందట. 80కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ టార్గెట్‌తో థియేటర్లలోకి రాబోతుందని సమాచారం. ఇది నాని కెరీర్‌లోనే హైయ్యేస్ట్ బిజినెస్‌ అయిన మూవీగా నిలిచింది. పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేయబోతుండటం, మట్టిలో నుంచి పుట్టిన కథ కావడం, ఇలాంటి యాక్షన్‌ సినిమాలు సంచలనాలు క్రియేట్‌ చేస్తున్న నేపథ్యంలో టీమ్‌ కూడా నమ్మకంతో ఉన్నారు. నానిలో ఆ కాన్ఫిడెంట్‌ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది మున్ముందు చూడాలి. `దసరా`లో నానికి జోడీగా కీర్తిసురేష్‌ నటిస్తుంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు.