Asianet News TeluguAsianet News Telugu

‘దసరా’కి బడ్జెట్ మొదట ఎంత అనుకున్నారు?..ఎంత పెట్టారు ? షాకింగ్ డిటేల్స్

 విరాట పర్వం, రామ్‌రావ్ ఆన్ డ్యూటీ ఫ్లాప్‌ అవ్వటంతో ఈ సినిమా బడ్జెట్ పై మొదట్లో భయపడ్డారని, నాని స్వయంగా తనదీ పూచి అని చెప్పి ఒప్పించి సినిమా చేయించాడని చెప్పుకుంటున్నారు. 

Nani Dasara end budget is almost double of planned budget
Author
First Published Feb 6, 2023, 7:04 AM IST

నాని కెరీర్ లో మొదట మాస్ సినిమా దసరా. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓడెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని ఊరమాస్ గెటప్ లో కనిపించి దుమ్ము రేపుతున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ కు నాని ఫ్యాన్స్ ని కూడా ఆశ్చర్యపరిచింది. లుంగీ కట్టుకొని మాసిపోయిన గెడ్డంతో బొగ్గు గనుల్లో మునిగితేలినట్లుగా చాలా కొత్తగా వుంది నాని ఎప్పిరియన్స్. విజువల్స్, నేపధ్య సంగీతం, నానీ మ్యానరిజం, డైలాగ్ డెలివరీ అన్నీ కొత్తగా వున్నాయి. పాన్ ఇండియా సినిమాగా దసరా ని విడుదల చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత ...ఎంత ఖర్చు పెట్టారు వంటి విషయాలు చూద్దాం.

నేచురల్ స్టార్ నానీ తాజా చిత్రం “దసరా” సినిమా టీజర్ రిలీజ్ అయ్యనప్పటి నుంచి అంతటా హాట్ టాపిక్ గా మారిపోయింది. దానికి తోడు ఈ సినిమా ఓవర్-బడ్జెట్ అయ్యిందని  వినిపిస్తున్నాయి.  నిర్మాత  సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేసిన   విరాట పర్వం, రామ్‌రావ్ ఆన్ డ్యూటీ ఫ్లాప్‌ అవ్వటంతో ఈ సినిమా బడ్జెట్ పై మొదట్లో భయపడ్డారని, నాని స్వయంగా తనదీ పూచి అని చెప్పి ఒప్పించి సినిమా చేయించాడని చెప్పుకుంటున్నారు.  ఈ తరుణంలో నిర్మాత అసలు ఈ సినిమా నిమిత్తం బాగా ఖర్చుపెట్టారని సమాచారం.

#Dasara సినిమాని మొదట 35 కోట్లు పెట్టుబడి ప్లాన్ చేసారని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత అది ఊహించని విధంగా 65 కోట్లకు చేరిందని వినికిడి. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ : 80 కోట్లు అయ్యింది. నాని కెరీర్ లోనే టాప్ బిజినెస్ ఇది.

మరో ప్రక్క  టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాని మాటలు దసరా పై అతనికి వున్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. ‘’దసరా నాకు చాలా స్పెషల్ మూవీ. తెలుగు సినిమా గురించి నా సహకారం ఏమిటని చాలా సార్లు ఆలోచించే వాడిని. తెలుగు, ఇండియన్ సినిమాకి ఈ ఏడాది నా తరపున నుంచి సహకారం… శ్రీకాంత్ ఓదెల. అది ఎందుకో, ఎలాంటి సినిమా తీశాడో మార్చి 30న తెలుస్తుంది. సినిమా నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. గత ఏడాది తెలుగు సినిమా నుంచి ఆర్ఆర్ఆర్, కన్నడ నుంచి కేజీఎఫ్ వచ్చింది. చాలా నమ్మకంగా చెబుతున్నాను.. ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి దసరా వస్తోంది’’ అని చెప్పుకొచ్చారు నాని. నాని నమ్మకం నిజం అవ్వాలని కోరుకుందాం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios