సారాంశం

`800` సినిమా కథ మన తెలుగు హీరో నాని వద్దకు వచ్చిందట. మొదట ఈ చిత్రంలో ముత్తయ్య మురళీధరన్‌ పాత్ర కోసం విజయ్‌సేతుపతిని అనుకున్నారు. కానీ ఆ తర్వాత..

లెజెండరీ క్రికెటర్‌, శ్రీలంక ఆఫ్‌స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా `800` చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ముత్తయ్య పాత్రలో `స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌` ఫేమ్‌ మధుర్‌ మిట్టల్‌ నటించారు. ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 6న సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా `800` సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు నిర్మాత. 

ఈ కథ మన తెలుగు హీరో నాని వద్దకు వచ్చిందట. మొదట ఈ చిత్రంలో ముత్తయ్య మురళీధరన్‌ పాత్ర కోసం విజయ్‌సేతుపతిని అనుకున్నారు. కొంత షూట్‌ కూడా జరిగింది. ఫస్ట్ లుక్‌ బయటకు వచ్చాక పెద్ద గొడవ అయ్యింది. తమిళనాడులో కొంతమంది గొడవ చేయడంతో కాంట్రవర్సీలు వద్దని సేతుపతి తప్పుకున్నారు. ఆ తర్వాత ఎవరితో చేస్తే బాగుంటుందనుకున్నప్పుడు నాని ఆలోచన వచ్చిందట. దర్శకుడు శ్రీపతి నాని పేరు సజెస్ట్ చేశాడట. అయితే ఈ కథ కూడా ఆయనకు చెప్పారట. 

అకానీ అప్పటికే నాని `జెర్సీ` సినిమా చేశాడు. దీంతో వెంటనే మరో క్రికెట్‌సినిమా అంటే జనాలు చూడరని చెప్పేశాడట. తాను సినిమా చేయను అనే కథ విన్నారట. కథ నచ్చిందని చెప్పారని తెలిపారు. ఆ తర్వాత మధుర్‌ని పరిగణలోకి తీసుకున్నట్టు తెలిపారు నిర్మాత. మురళీధరన్ గారికి నాని అంటే ఇష్టం. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారని తెలిపారు. 

ఇక ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్‌ చేస్తున్నారట. `800` పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ అవుతున్న విసయం తెలిసిందే. `ఇండియాలో సుమారు 1100 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. మేం ఎక్కువగా మల్టీప్లెక్స్ స్క్రీన్ ల మీద దృష్టి పెట్టాం. తర్వాత మెల్లగా థియేటర్లు పెంచుతూ వెళ్తాం. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో నైజాం సునీల్ నారంగ్, విశాఖ & ఉత్తరాంధ్ర దిల్ రాజు, ఈస్ట్ గోదావరి గీతా ఫిలింస్, వెస్ట్ గోదావరి ఎల్.వి.ఆర్, కృష్ణాజిల్లా అన్నపూర్ణ స్టూడియోస్, నెల్లూరు అంజలి పిక్చర్స్ భాస్కర్ రెడ్డి, సీడెడ్ ఎస్ సినిమాస్, గుంటూరు పద్మాకర్ సినిమాస్,నార్త్ లో యుఎఫ్ఓ సంస్థ డిస్టిబ్యూట్ చేస్తోందని శివలెంక తెలిపారు. 

తమ బ్యానర్‌లో చేసే నెక్ట్స్ సినిఆల గురించి చెబుతూ,  దర్శకుడు శ్రీపతితో ఓ సినిమా చేస్తున్నట్టు తెలిపారు.  'యశోద' దర్శకులతో ఒక సినిమా ఉంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాం. దర్శకుడు పవన్ సాధినేనితో చర్చలు జరుగుతున్నాయి. తెలుగులో 'వదలడు' పేరుతో విడుదలైన సిద్ధార్థ సినిమా దర్శకుడు సాయి శేఖర్ సైతం ఓ కథ చెప్పాడు. నాలుగైదు కథలు రెడీ అవుతున్నాయి. హీరోలకు వినిపించి ఆ తర్వాత సినిమాలు ప్రకటిస్తా. డిఫరెంట్‌ సినిమాలు చేయబోతున్నా` అని చెప్పారు.