Nani : ‘హాయ్ నాన్న’ ప్రీపోన్.. ‘సలార్’ రిలీజ్ వల్లే వెనక్కి వచ్చారా? నాని సూపర్ ఆన్సర్

‘సలార్’ వాయిదాతో ఆ నెలలోని చిత్రాలన్నీ ముందుగానే థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ‘హాయ్ నాన్న’ 14 రోజుల ముందే వస్తోంది. తాజాగా రిలీజ్ డేట్ లో మార్పుపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 
 

Nani Clarity on Hai Nanna movie release date Preponed NSK

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘సలార్’కు ఎంత డిమాండ్ ఉందో తెలిసిందే. వరల్డ్ వైడ్ గా సినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఈ చిత్రం డిసెంబర్ 22కు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆ నెలలో ఉన్న చిత్రాలన్నీ సలార్ ఫిక్స్ చేసిన డిసెంబర్ 22 కంటే రెండు వారాలు ముందు లేదంటే ఆ తర్వాత వస్తున్నాయి. ఇప్పటికే నితిన్ ‘ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్’, వెంకీ ‘సైంధవ్’ సినిమాలు డేట్ ను మార్చుకున్న విషయం తెలిసిందే. 

ఇక నాని లేటెస్ట్ ఫిల్మ్ ‘హాయ్ నాన్న’ (Hai Nanna)  కూడా రిలీజ్ డేట్ ను మారుస్తూ ఈరోజు అనౌన్స్ మెంట్ ఇచ్చింది. టీజర్ విడుదల చేస్తూ సినిమా 14 రోజుల ముందుగానే విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. డిసెంబర్ 7న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఈరోజు టీజర్ లాంచ్ ఈవెంట్ లో నానికి రిలీజ్ డేట్ పై ప్రశ్న ఎదురైంది. దీంతో సూపర్ ఆన్సర్ తో బదులిచ్చాడు. ఆ కామెంట్స్  వైరల్ గా మారాయి. 

‘సలార్’ రిలీజ్ వల్లే ‘హాయ్ నాన్న’ చిత్రాన్ని ముందుగానే విడుదల చేస్తున్నారా? ఏందుకు రిలీజ్ డేట్ ను మార్చాల్సి వచ్చిందంటూ నానికి ప్రశ్న ఎదురైంది. దీంతో నాని బదులిస్తూ..  ముందుగా డిసెంబర్ 21నే విడుదల చేద్దామనుకున్నాం. కానీ ముందే రావాల్సి వచ్చింది. ఒక కుటుంబంలో పెద్ద అన్నకు సంబంధించిన ఫంక్షన్ జరిగితే.. చిన్న వాళ్లవి వాయిదా వేస్తారు కదా.. అందుకే మా సినీ కుటుంబంలోని పెద్దవాళ్లను గౌరవిస్తూ వెనక్కి వచ్చాం. అందులో ప్రాబ్లం ఏమీ లేదు. డిసెంబర్ అంతా మంచి యాక్షన్ తో, బ్యూటీఫుల్ లవ్ తో అలరిస్తుంది’... అంటూ సమయస్ఫూర్తితో బదులిచ్చారు.  దీంతో ఇటు నాని ఫ్యాన్స్, అటు ప్రభాస్ అభిమానులు ఖుషి అవుతున్నారు. 

 ‘హాయ్ నాన్న’ టీజర్ ఆసక్తికరంగా ఉంది. తండ్రి, కూతురు సెంటిమెంట్, బ్యూటీఫుల్ లవ్ స్టోరీ, ఎమోషనల్ అంశాలు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. చిత్రానికి శౌర్యూవ్ దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా కూతురి పాత్రలో అలరించబోతోంది. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  కథానాయిక. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. హేషమ్ అబ్దుల్ సంగీతం. డిసెంబర్ 7న ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios