హీరో నాని పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ టీజర్ విడుదల చేశారు చిత్ర బృందం. దర్శకుడు శివ నిర్వాణ తన గత చిత్రాలకు కంప్లీట్ డిఫరెంట్ గా టక్ జగదీష్ తెరకెక్కించాడని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. నిన్ను కోరి, మజిలీ చిత్రాలలో లవ్ ఎమోషన్స్ పండించిన ఆయన... టక్ జగదీష్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కించారని అర్థం అవుతుంది. 

అందమైన పల్లెటూరిలో ఊరి పెద్ద నాజర్ కొడుకులుగా నాని, జగపతి బాబు కనిపిస్తుండగా... విలేజ్ యాక్షన్ డ్రామాను టక్ జగదీష్ తలపిస్తుంది. నాని లుక్ యాటిట్యూడ్ సరికొత్తగా ఉండగా, సినిమాపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. డైలాగ్స్ లేకుండా జానపద గీతంతో టీజర్ కట్ చేసిన తీరు బాగుంది. నాని టక్ జగదీష్ రూపంలో ఓ హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న టక్ జగదీష్ చిత్రానికి సంగీతం థమన్ అందించారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించారు. తమిళ నటుడు డానియల్ బాలాజీ విలన్ గా నటిచడం విశేషం. ఇక టక్ జగదీష్ ఏప్రిల్ 23న విడుదల కానుంది. మొత్తంగా టక్ జగదీష్ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఫుల్ మీల్ వలె ఉండడం ఖాయంగా కనిపిస్తుంది.