నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికీ'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికీ'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. జూన్ 10న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఈ చిత్రంలో నానికి జోడిగా మలయాళీ బ్యూటీ నజ్రియా నటిస్తోంది.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే మూవీ ఫుల్ ఫన్ రైడ్ లాగా అనిపిస్తోంది. నాని ఫుల్ లెన్త్ ఫన్ రోల్ లో నటించి చాలా కాలమే అవుతోంది. ట్రైలర్ లో నాని తన మార్క్ కామెడీ టైమింగ్ తో అలా మొదలయింది, భలే భలే మగాడివోయ్ లాంటి చిత్రాల మ్యానరిజమ్స్ గుర్తు చేస్తున్నాడు.
సినిమా మొత్తం నాని పెళ్లి కోసం పడే తిప్పలని చూపిస్తున్నారు. సాంప్రదాయ హిందూ మతానికి చెందిన ఫ్యామిలీలో పుట్టిన నాని.. క్రిస్టియన్ యువతిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేదే ఈ చిత్ర కథగా అర్థం అవుతోంది. దీనితో దర్శకుడు వివేక్ ఫన్ ఎలిమెంట్స్ తో నింపేశాడు.
నాని, నజ్రియా వివాహానికి మతం మాత్రమే అడ్డా లేక మరేదైనా సమస్య ఉందా అనేది సినిమా చూసే తెలుసుకోవాలి. 'నా జీవితానికి వీళ్ళు చాలదు అన్నట్లు కొత్త క్యారెక్టర్ ఎంటర్ ఐంది అంటూ నాని చెప్పే డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి. నాని తండ్రిగా నరేష్ నవ్వులు పూయిస్తున్నారు. భలే భలే మగాడివోయ్ చిత్రంలో వీరిద్దరూ తండ్రి కొడుకులుగా మంచి హాస్యం పండించారు. ఈ చిత్రంలో కూడా చెలరేగిపోయినట్లు తెలుస్తోంది, నజ్రియా క్యూట్ గా కనిపిస్తూ మెప్పిస్తోంది. మొత్తంగా అంటే సుందరానికీ' ట్రైలర్ మెప్పించే విధంగా ఉంది.

