నాని నేచురల్ స్టార్ అని నిరూపించుకుంటూనే ఉన్నాడు. రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ.. తన టాలెంట్ చూపించుకుంటున్నాడు. ఇక నానీ నటించిన తాజా సినిమా అంటే సుందరానికీ.. ఈమూవీ నుంచి సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.  

నాని నేచురల్ స్టార్ అని నిరూపించుకుంటూనే ఉన్నాడు. రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ.. తన టాలెంట్ చూపించుకుంటున్నాడు. ఇక నానీ నటించిన తాజా సినిమా అంటే సుందరానికీ.. ఈమూవీ నుంచి సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 

ఈ మధ్య అన్నీ విభిన్న కథలతో... డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో సినిమాలు చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇక నానీ హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా అంటే ... సుందరానికీ. ఆచార వ్యవహారాలు బాగా పాటించే ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా ఈ సినిమాలో నాని కనిపించనున్నాడు. నానీ ఫస్ట్ టైమ్ ఇలాంటి పాత్రలో కనించబోతున్నాడు. 

ఇక అలాంటి ఆచారాలు పాటించే వ్యాక్తి విదేశాలకి వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కథతో అంటే సుందరానికి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని జోడిగా మలయాళ బ్యూటీ నజ్రియా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అయిపోయి.. పోస్ట్ ప్రొడక్సన్ పనులు జరుగుతున్నాయి. 

 మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ ఒక రేంజ్ లో రీచ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఎంత చిత్రం లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు మేకర్స్.

Scroll to load tweet…

ఈ నెల 9న ఉదయం 11:07 నిమిషాలకు ఈ పాటను రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ పాట యూత్ కి ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందో చూడాలి. నదియా .. రోహిణి కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, నరేష్, సుహాస్, రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.