న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా ఒక హిట్టు కొట్టాలని కసి మీద ఉన్నాడు. అందుకే తెరపై కూడా కసిగా అనిపించే కథలను ఎంచుకుంటున్నాడు. దేవదాస్ సినిమాతో నాగార్జునతో మల్టీస్టారర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. ఇక నాని ఇప్పుడు మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.  

సమ్మోహనం సినిమాతో చాలా కాలం తరువాత హిట్టందుకున్న సుదీర్ బాబు నానితో .వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నానితో అష్టాచమ్మా - జెంటిల్ మెన్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాలను తెరకెక్కించిన సమ్మోహనం దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి నెక్స్ట్ సినిమా నానితో చేయబోతున్న సంగతి తెలిసిందే. 

గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నారు. అయితే సినిమాలో నాని పాత్రకు సమానంగా ఉండే మరో క్యారెక్టర్ కోసం దర్శకుడు సుదీర్ బాబును ఎంచుకున్నాడు. త్వరలోనే ఇద్దరి హీరోలను ఒకే ఫ్రెమ్ లో ఉంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే దేవ దాస్ తో హీట్టుకొట్టలేని నాని ఇప్పుడు ఈ మీడియం మల్టీస్టారర్ తో అయినా హిట్టు అందుకుంటాడో లేదో చూడాలి.