సినిమాకు సంబందించిన ఏ ఈవెంట్ లో అయినా దర్శకుడు తప్పకుండా ఉండాల్సిందే. అయితే రీసెంట్ గా జరిగిన నాని జెర్సీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకుడు గౌతమ్ తన్ననూరి డుమ్మా కొట్టేశాడు. ఈ విషయంపై రూమర్స్ ఎలా ఉన్నా కూడా నాని మాత్రం యువ దర్శకుడి కమిట్మెంట్ కి ఫిదా అయినట్లు తెలుస్తోంది. 

ఈవెంట్ లో అతని గురించి మాట్లాడుతూ.. గౌతమ్ చెన్నైలో సినిమా మిక్సింగ్ పనులకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఫైనల్ కాపీ వచ్చిన తరువాత అమెరికాకు పంపాలి కాబట్టి తీరిక లేకుండా ఉన్నాడు. మధ్యాహ్నం వరకే పని ఓ కొలిక్కి రాగా నేను రమ్మని ఫోన్ చేశా. కానీ గౌతమ్ పూర్తిగా పనులన్నీ ఎండ్ అయ్యే వరకు రాత్రి 9 అవుతుందని.. అన్ని అయిపోయే వరకు ఇక్కడ ఉండగలిగితే అప్పుడు అవుట్ ఫుట్ బావుంటుందని గౌతమ్ చెప్పినట్లు నాని వివరించాడు. 

గౌతమ్ చెప్పిన విధానానికి అక్కడే నాని ఫిదా అయిపోయాడు. ఇండస్ట్రీలో అతడు గొప్ప దర్శకుడవుతాడని అలాంటి వ్యక్తితో వర్క్ చేయడం తన అదృష్టమని నాని తెలిపాడు. ఇక అనిరుద్ కూడా వేడుకకు రాకపోవడంతో వేరే పనుల వల్ల బిజీగా ఉంటూ రాలేకపోయాడని నాని క్లారిటీ ఇచ్చాడు.