బిగ్ బాస్ సీజన్ 2 పై తన దగ్గర ఎటువంటి అప్ డేట్స్ లేదంటున్న నాని

బిగ్ బాస్ సీజన్ 2 పై తన దగ్గర ఎటువంటి అప్ డేట్స్ లేదంటున్న నాని

బిగ్ బాస్ అప్పటి వరకు రియాలిటీ షోలు ఒకవైపు కానీ బిగ్ బాస్ ఎప్పుడైతే వచ్చిందో సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు ఉన్న టీఆర్పీ లు గల్లంతై కొత్త రికార్డులను సృష్టించింది. దానికి ఒకే ఒక్క కారణం తారక్ తనకు తెలుగు పట్ల ఉన్న పట్టు అవలీలగా తెలుగు మాట్లాడడం,చురుకుదనం ఇలా చాలా. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేవలం తారక్ హోస్టింగ్ వల్లే ఆ షో హిట్టయ్యింది అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ డేట్స్ కుదరకపోవడం వల్లనో తన భర్య ప్రెగ్నెన్సీ వలనో తారక్ బిగ్ బాస్ 2 చేయట్లేదు. ఆ తరువాత ఆప్షన్ ఎవరు లేకపోయిన ఉన్నవాళ్లలో కొంచెం నాని అయితే బెటర్ అని స్టార్ మా యాజమాన్యం భావించినట్టు సమాచారం.

కృష్ణార్జునయుద్ధం ప్రమోషన్లో భాగంగా ఆయనను అడిగితే ఇలా చెప్పుకొచ్చాడు... "బిగ్ బాస్ సీజన్ వన్ తారక్ హోస్ట్ గా చేయడం - ఆ షో పెద్ద హిట్ అవ్వడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తరువాత సీజన్ కి నన్ను ఆ ఛానల్ వారు నన్ను ఎప్రోచ్ అయ్యారనే విషయం పై ప్రస్తుతానికి నేను ఎలాంటి కామెంట్స్ చేయలేను. నన్ను హోస్ట్ గా తీసుకోవడం పై పూర్తి నిర్ణయం ఛానల్ వారిదే. ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి అప్ డేట్ లేదు. ఒక వేళ ఏదేనై ఉంటే అతి త్వరలోనే అధికారికంగా ఛానల్ వారు ప్రకటిస్తారు" అంటూ సమాధానం ఇచ్చారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos