నేచురల్‌ స్టార్‌ నాని తన అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `నాని30` నుంచి టైటిల్‌ని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది.

నేచురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం `నాని 30` చిత్రంలో నటిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తున్న చిత్రమిది. శృతి హాసన్‌ కీలకపాత్రలో నటిస్తుంది. కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్‌ని ప్రకటించారు. `హాయ్‌ నాన్న` అనే పేరుని ఖరారు చేశారు. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్‌తో ఈ సినిమా సాగుతున్న నేపథ్యంలో ఈ టైటిల్‌ని ఫైనల్‌ చేయడం విశేషం. ఇందులో నాని కూతురుకి తండ్రిగా నటిస్తున్నారు. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్‌తో ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందుతుంది. శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాని పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల చేయబోతుండటం విశేషం. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ టైటిల్స్ ని ప్రకటించారు. ఈ సందర్బంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో పెద్ద వాల్‌కి నాని నిల్చొని ఫోన్‌ చూసుకుంటుండగా, నానిపై కూర్చొన్న ఓ చిన్న పాప వెనకాల ఉన్న హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌తో సైలెంట్‌గా ఫ్లైయింగ్‌ కిస్‌తో హయ్‌ చెబుతుండటం, ఆ పాపతో మృణాల్‌ సరదాగా ఆడుకుంటుండటం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో నాని కాజ్వల్‌ డ్రెస్‌లో ఉన్నారు. మృణాల్‌.. బాటన్‌ డౌన్‌ మ్యాక్సి డ్రెస్‌లో నవ్వులు చిందిస్తూ అలరిస్తుంది. 

ఇక తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ లో నాని కూతురు తన ఫ్రెండ్‌ యశ్న(మృణాల్‌ ఠాకూర్‌)ని పరిచయం చేస్తుంది. అనంతరం తండ్రి నాని పరిచయం చేస్తుంది. ఈ ముగ్గురు లంచ్‌కి హోటల్‌కి వెళతారు. అక్కడ మృణాల్‌ని నానికి పరిచయం చేస్తుంది కూతురు. మరి నాని ఒకరిని చూసి నిర్వేదపోతాడు. మరి ఆమె ఎవరు? మృణాల్‌ ఎవరు? వీరి రిలేషన్‌ ఏంటి? అనేది మిగిలిన కథ. ఫస్ట్ లుక్‌ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌గా ఉంది. హృదయాలను హత్తుకునేలా ఉంది. 

YouTube video player

ఆద్యంతం ఫ్యామిలీ ఎమోషనల్‌గా, ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్ గా ఈ సినిమా సాగుతుందని ఈ గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది. హేషామ్‌ అబ్దుల్‌ వహాబ్‌ హృదయాన్ని కదిలించే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. భావోద్వేగ లోతులను టచ్‌ చేసే ఈ మ్యూజిక్‌ సాగింది. సినిమాని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. డిసెంబర్‌ 21న సినిమా విడుదల కాబోతుంది.