చిరంజీవి చేతుల మీదుగా నాని 30 సినిమా ప్రారంభం.. గ్రాంగ్‌గా ఓపెనింగ్ సెర్మనీ..
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త సినిమా మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

నేచురల్ స్టార్ నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. నూతన దర్శకుడు శౌర్య దీనికి దర్శకత్వం వహిస్తుండగా, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. `సీతారామం` ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మంగళవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో గ్రాండ్ స్కేల్లో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సినిమా షూరూ అయ్యింది.
హీరో నానిపై ముహూర్తపు షాట్‌కి చిరంజీవి క్లాప్ నిచ్చారు. నిర్మాత అశ్వినీదత్ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు బుచ్చిబాబు, కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ట, వివేక్ ఆత్రేయ కలిసి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. ప్రముఖ రైటర్ విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ అందించారు. ఈ కార్యక్రమంలో `పలాస` ఫేమ్ కరుణ కుమార్, గిరీష్ అయ్యర్, దేవా కట్టా, చోటా కె నాయుడు, సురేష్‌బాబు, దిల్‌రాజు, రామ్ గోపీ ఆచంటలు, అనిల్ సుంకర, రవిశంకర్, దివివి దానయ్య, స్రవంతి రవికిశోర్, కెఎస్ రామారావు, సాహు గారపాటి, ఏసియన్ సునీల్ వంటి సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ని రేపటి(బుధవారం) నుంచి ప్రారంభించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. సాను జాన్ వరుగీస్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్, జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.
ప్రస్తుతం నాని `దసరా` చిత్రంలో నటిస్తున్న విసయం తెలిసిందే. కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఓడెలా దర్శకత్వం వహించారు. తెలంగాణ సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ చిత్ర టీజర్ సోమవారం విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. అంచనాలను పెంచేసింది. ఇందులో నాని డైలాగులు గూస్ బంమ్స్ తెప్పిస్తున్నాయి. ఈ సినిమాని మార్చిలో పాన్ ఇండియా మూవీలా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల చేయబోతున్నారు.