సెలబ్రిటీలపై ట్రోలింగ్ అనేది సాధారణ విషయంగా మారిపోయింది. కొంతమంది ఈ ట్రోలింగ్ ని లైట్ తీసుకుంటుంటే మరికొందరు మాత్రం బాధపడుతుంటారు. తన కెరీర్ లో అలా బాధ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెబుతోంది హీరోయిన్ నందిత శ్వేతా.

తనకు సినిమాలు తగ్గిపోయాయని, సినిమాలు ఎందుకు చేయడం లేదంటూ టిక్ టాక్ లు చేస్తున్నారని అవి తనను బాగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పింది నందిత. సినిమాలు చేయనంత మాత్రాన ఖాళీగా ఉన్నట్లు కాదని, తనకు కూడా పనులు ఉంటాయని.. ఇలా టిక్ టాక్స్ చేయడం చాలా ఘోరమని చెప్పింది.

కేవలం చదువు కోసం మాత్రమే బ్రేక్ తీసుకున్నానని, ఒక దశలో ఎందుకు గ్యాప్ వచ్చిందనే విషయం తనకు తెలియలేదని చెప్పుకొచ్చింది. స్టార్స్ తో ఎందుకు నటించడం లేదని అడిగినప్పుడు కూడా బాధేస్తుందని చెప్పింది. నటిగా అన్ని రకాల చిత్రాల్లో నటించాలని, తను కూడా అదే చేస్తున్నట్లు తెలిపింది.

మొదటి సినిమా సక్సెస్ అవ్వడంతో తనకు అన్నీ హారర్ పాత్రలే వస్తున్నాయని, ఇప్పుడిప్పుడే ఆ జోనర్ నుండి బయటకొస్తున్నామని తెలిపింది. త్వరలోనే ఓ స్టార్ హీరో సరసన ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది.