ఇటీవల సమంత, నందినిరెడ్డిల కాంబినేషన్ లో వచ్చిన 'ఓ బేబీ' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వీరిద్దరూ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరికి హైకోర్టు షాక్ ఇచ్చింది.

అయితే ఆ షాక్ 'ఓ బేబీ' సినిమాకి సంబంధించినది కాదు.. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'జబర్దస్త్' సినిమాకు సంబంధించిన విషయం. 2013లో నందిని రెడ్డి రూపొందించిన 'జబర్దస్త్' అనే సినిమా విడుదలైంది. ఇందులో సమంత లీడ్ రోల్ పోషించింది. సినిమా విడుదలైన తరువాత ఓ వివాదం వీరిని చుట్టుముట్టింది.

2010లోరణవీర్ సింగ్, అనుష్క శర్మ జంటగా నటించిన 'బ్యాండ్ బాజా బరాత్' సినిమాను ఎలాంటి రైట్స్ తీసుకోకుండా తెలుగులో 'జబర్దస్త్' పేరుతో రూపొందించారని బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ కోర్టులో కేసు పెట్టింది.

ఆరేళ్ల తరువాత కోర్టు నిర్మాణ సంస్థకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 'జబర్దస్త్' సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రదర్శన చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.