బిగ్ బాస్2: వెక్కి వెక్కి ఏడ్చిన నందిని.. కారణమేంటంటే

Nandini Cries in Bigg Boss2 Telugu
Highlights

ఓ స్టేట్మెంట్ 'మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు'. ఇది ఎవరికీ సరిపోతుందని బిగ్ బాస్ అడగగా.. అందరూ నందిని పేరు చెప్పారు. దీంతో సరిగ్గా చెప్పారు అంటూ బిగ్ బాస్ కామెంట్ చేసి నందినికి ఇష్టమైన ఫుడ్ ఏంటని అడిగి దాన్ని హౌస్ లోకి పంపించారు

రోజురోజుకి బిగ్ బాస్ సీజన్ 2 రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు ఇచ్చే టాస్క్ లు ఆసక్తికరంగా ఉండడంతో షోపై ప్రేక్షకుల ఇంట్రెస్ట్ మరింత పెరుగుతుంది. అయితే నిన్నటి షోలో కూడా బిగ్ బాస్ ఓ ఆసక్తికర టాస్క్ తో హౌస్ మేట్స్ తో ఆదుకున్నారు. కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ.. అవి ఎవరికీ నప్పుతాయో చెప్పాలని బిగ్ బాస్ తన కంటెస్టెంట్స్ ను అడిగాడు.

ఇందులో భాగంగా ఇచ్చిన ఓ స్టేట్మెంట్ 'మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు'. ఇది ఎవరికీ సరిపోతుందని బిగ్ బాస్ అడగగా.. అందరూ నందిని పేరు చెప్పారు. దీంతో సరిగ్గా చెప్పారు అంటూ బిగ్ బాస్ కామెంట్ చేసి నందినికి ఇష్టమైన ఫుడ్ ఏంటని అడిగి దాన్ని హౌస్ లోకి పంపించారు. అయితే హౌస్ తో ఎంటర్ అయినప్పటి నుండి కొందరు తనను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారని నందిని తెగ బాధపడిపోయింది. తనను పైకి ఒకలా, లోపల మరోలా ఉండే మనస్తత్వం గల వ్యక్తినంటూ హౌస్ మేట్స్ భావించడంతో నందిని మనస్తాపానికి  గురైంది.

ఇక 'ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుగానీ, బిగ్ బాస్ గురించి మాత్రం తెలియదు' అంటే బాబు గోగినేని పేరుని, 'కొండంత మనిషైనా కానీ మనసు వెన్న' అంటే అమిత్ పేరుని, 'కొంచెం మంచి కొంచెం చెడు' అంటే కౌశల్ ను, 'అసలు దాన్ని వదిలేసి కొసరును పట్టుకొని వేలాడుతుంది' అనే స్టేట్మెంట్ కు గీతామాధురిని, 'ప్రేమ పూజారి' అంటే తనీష్ ని, 'చిన్నదానిగా  వచ్చి ఘాటు మిర్చిగా మారింది' అనే స్టేట్మెంట్ కు దీప్తి సునైనాను, 'ఎలిమినేషన్ అంటే భయం' అనే స్టేట్మెంట్ కు దీప్తిని, 'లడ్డుబాబు'గా గణేష్ పేరుని, ఆనందించే వాడిగా రోల్ రైడా పేర్లను చెప్పారు.   

loader