తారకరత్న ఈ సారి ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేయాలని భావించాడు. తొలిరోజు లోకేష్ పాదయాత్రకి కూడా హాజరయ్యాడు. కానీ ఇంతలో ఈ విషాదం జరిగింది.
అతి పిన్న వయసులోనే నందమూరి తారకరత్న మరణించడంతో కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చింది. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. హీరోగా రాణించిన తారక రత్న రాజకీయాల్లో కూడా తన మార్క్ ప్రదర్శించాలనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఆయనకి గుండె సమస్య తీవ్రంగా మారడంతో మరణం సంభవించింది.
తారకరత్న మరణం తర్వాత కుటంబ భారం ఆయన భార్య అలేఖ్య రెడ్డిపై పడింది. వీరిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. తన భర్త మరణంతో అలేఖ్య ఇప్పట్లో కోలుకునేలా లేదు. కుటుంబ సభ్యులు ఆమెకి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అలేఖ్య రెడ్డిని తిరిగి మామూలు మనిషిని చేసేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యంగా తారకరత్న ఫ్యామిలీకి బాలకృష్ణ నుంచి ఫుల్ సపోర్ట్ లభించబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా ఎలాంటి సమస్య లేకపోవచ్చు కానీ.. మానసికంగా ఆమె త్వరగా ఈ విషాదం నుంచి తేరుకోవాలని కోరుతున్నారు. అయితే ఎదో ఒక పనిలో ఆమె బిజీ అయితే కానీ మునుపటిలా మారడం కష్టం. అందుకే ఆమెని రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇందుకు బాలకృష్ణ చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తారకరత్న ఈ సారి ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేయాలని భావించాడు. తొలిరోజు లోకేష్ పాదయాత్రకి కూడా హాజరయ్యాడు. కానీ ఇంతలో ఈ విషాదం జరిగింది. తారకరత్నకి దక్కని అవకాశాన్ని అలేఖ్య రెడ్డికి అయినా కల్పించాలని బాలయ్య భావిస్తున్నారట.
చంద్రబాబుకి చెప్పి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగంలో ఆమెకి కీలక పదవి ఇవ్వాలని.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేయించాలని అనుకుంటున్నారట. గతంలో హరికృష్ణ మరణించినప్పుడు కూడా ఆయన కుమార్తె సుహాసినికి చంద్రబాబు తెలంగాణాలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అలేఖ్య రెడ్డి విషయంలో త్వరలోనే చంద్రబాబు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
