చాలా కాలం తరువాత మనస్సు విప్పి మాట్లాడాడు నందమూరి హీరోలలో ఒకడు తారకరత్నం. ఫ్యామిలీ విభేదాలతో పాటు ఎన్టీఆర్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తారకరత్న.
నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో తారకరత్న ఒకరు. హీరోగా కలిసిరాకపోవడంతో, విలన్ వేషాల వైపు టర్న్ తీసుకున్నాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన, మళ్లీ తన కెరియర్ పై దృష్టి పెట్టాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆయన తనకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో నందమూరి వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నందమూరి తారక రత్న. 2002లో రిలీజ్ అయిన ఈమూవీ కమర్షియల్‌గా అంత సక్సెస్ కాకపోయినా తారక రత్నకు మాత్రం మంచి నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది. యువరత్న, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు తారక రత్నకు మంచి పేరును తీసుకువచ్చాయి. కానీ తరువాత తరువాత ఈ హీరో కనుమరుగు అయ్యాడు.
తారక రత్న కథలను ఎంపిక చేసుకునే విధానంలో విఫలం అయ్యాడు. వరుస ఫ్లాప్‌లు వెంటబడటంతో హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు. వాటితో పాటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోడు అవ్వడంతో.. సినిమాలకు చాలా కాలం దూరం అయ్యాడు. ప్రస్తుతం ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నాడు. అయితే నందమూరి ఫ్యామిలీకి తారకరత్నం దూరం అయ్యాడు అన్న విమర్షలకు ఆయన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడారు.
నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లంతా నన్ను దూరం పెట్టినట్టుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదు. మా బాబాయిలు .. అత్తయ్యలు అందరూ కూడా నన్నెంతో బాగా చూసుకుంటూ ఉంటారు. అందరూ అనుకుంటున్నట్టుగా మా మధ్య ఎలాంటివో విభేదాలు లేవు అని క్లారిటీ ఇచ్చాడు తారక రత్న.
ఇక ఎన్టీఆర్ కి పోటీగా నన్ను దింపినట్టుగా కూడా అప్పట్లో చెప్పుకున్నారు. కానీ మా ఫ్యామిలీలో ఎవరూ ఎప్పుడూ అలా అనుకోలేదు. ఎన్టీఆర్ ముందుకు వెళుతున్నాడంటే, నందమూరి ఫ్యామిలీ ముందుకు వెళుతుందనే అర్థం. మేమందరం ప్రేమాభిమానాలతోనే ఉన్నాము. పుకార్లు సృష్టించేవారికి సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదు అని క్లియర్ కట్ గా చెప్పారు తారకరత్న.
