త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ మూవీ ప్రారంభం సినిమాకి సంబందించిన విష‌యాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న బాల‌య్య‌ వారాహి బ్యాన‌ర్ లో మోక్ష‌జ్ఞ సినిమా
గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని వైజాగ్, సీడెడ్ ఏరియాల్లో నిర్మాత సాయి కొర్రపాటి డిస్ట్రిబ్యూట్ చేసారు. శాతకర్ణి అన్ని ఏరియాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.ఈ సందర్భంగా సాయి కొర్రపాటి మీడియాతో మాట్లాడుతూ...మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని ఇస్తానని బాలకృష్ణ గారు నాకు మాట ఇచ్చారు.
అందుచేత మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ మా వారాహి చలనచిత్ర బ్యానర్ లోనే ఉంటుంది అని తెలియచేసారు. ఇటీవల బాలయ్యను కూడా మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు ఉంటుంది అని అడిగితే ఇంకా టైమ్ ఉంది. తర్వాత చెబుతాను అన్నారు. మరి...త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి..!
