Asianet News TeluguAsianet News Telugu

#Mokshagna:బాలయ్య సినిమాలో స్పెషల్ పాత్రలో మోక్షజ్ఞ ! ఎంట్రీ ఖరారు

ఈ నందమూరి వారసుడి కోసం అభిమానులుఎదురు చూస్తున్నారు. మరి మోక్షజ్ఞ ఇంత సన్నబడి బాడీ మెయింటైన్ చేసేది సినిమా కోసమే అయితే ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలనుకుంటూంటే ఓ వార్త బయిటకు వచ్చింది.

Nandamuri Mokshagna Debuts in Balayya boyapati movie?jsp
Author
First Published Jan 9, 2024, 3:08 PM IST


నంద‌మూరి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలసిందే.  ఎప్పుడు తెరపై కనిపిస్తాడనే ప్ర‌శ్న‌ను బాల‌కృష్ణ‌ను అడిగితే అదిగో ఇదుగో అంటున్నారు. నిజానికి 2017లోనే తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. ఓ దశలో అయితే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ‘ఆదిత్య 369’ సీక్వెల్ అని కూడా ప్రచారం జరిగింది.  అలాగే  కొన్నాళ్లు ముందు బొద్దుగా ఉన్న మోక్ష‌జ్ఞ ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి.

 ఇత‌నెప్పుడు స‌న్న‌బ‌డ‌తాడు.. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని అనుకున్న‌వాళ్లు కూడా లేక‌పోలేదు. అయితే ఇప్పుడు అలాంటి వాళ్లంద‌రూ మోక్ష‌జ్ఞ‌ను  స్లిమ్‌గా మారిపోయిపోయారు.  దాంతో మోక్షజ్ఞ సినిమా కోసమే సన్నబడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల బాలయ్య కూడా త్వరలోనే మోక్షజ్ఞని హీరోని చేస్తానని, శ్రీలీల హీరోయిన్ గా ఉండొచ్చని కూడా చెప్పాడు. దీంతో ఈ నందమూరి వారసుడి కోసం అభిమానులుఎదురు చూస్తున్నారు. మరి మోక్షజ్ఞ ఇంత సన్నబడి బాడీ మెయింటైన్ చేసేది సినిమా కోసమే అయితే ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలనుకుంటూంటే ఓ వార్త బయిటకు వచ్చింది.

ఇప్పుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ తొలి సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేస్తార‌నే విష‌యం కూడా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. బోయపాటి శ్రీను స‌హా ఇప్ప‌టికే చాలా మంది డైరెక్ట‌ర్స్ పేర్లు వినిపించాయి. మ‌రి ఎవ‌రు డైరెక్ట్ చేస్తారు? అస‌లు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? నిర్మాత‌లు ఎవ‌రు? వంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దాదాపు దొరికేసినట్లే . 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంది. బాలయ్య,బోయపాటి కాంబోలో ‘అఖండ 2’ సినిమా రాబోతుంది. ఇప్పటికే, బోయపాటి శ్రీను ‘అఖండ 2’ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేశాడు. కాగా ఈ సినిమాలో నందమూరి మోక్షజ్ఞ కోసం బోయపాటి ఓ స్పెషల్ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.ఖచ్చితంగా అఖండ 2లో బోయపాటి దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది. ఈ వార్త విని నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఇది అఫీషియల్ సమాచారం కాదు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios