నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తన బర్త్ డే(జులై 5) సందర్భంగా తన అభిమానులకు నాలుగు గిఫ్ట్ లిచ్చారు. తాను నటిస్తున్న `బింబిసార` చిత్రంలోని కొత్త లుక్‌ని విడుదల చేసి ఫిదా చేయగా, మరో నాలుగు కొత్త సినిమాలను ప్రకటించాడు. 

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తన బర్త్ డే(జులై 5) సందర్భంగా తన అభిమానులకు నాలుగు గిఫ్ట్ లిచ్చారు. తాను నటిస్తున్న `బింబిసార` చిత్రంలోని కొత్త లుక్‌ని విడుదల చేసి ఫిదా చేయగా, మరో నాలుగు కొత్త సినిమాలను ప్రకటించాడు. తన సొంత బ్యానర్‌ అయిన ఎన్టీఆర్‌ ఆర్ట్స్ పతాకంపై `బింబిసార` చిత్రం రూపొందుతుండగా, దీనికి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. మైథలాజికల్‌ చిత్రంగా రూపొందుతుంది. దీనికి సంబంధించి విడుదల చేసిన కొత్త లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

Scroll to load tweet…
Scroll to load tweet…

దీంతోపాటు కొత్తగా మరో మూడు సినిమాలన ప్రకటించాడు కళ్యాణ్‌రామ్‌. ఎన్‌కేఆర్‌(నందమూరి కళ్యాణ్‌రామ్‌) 19గా మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నారు. దీనికి రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక `ఎన్‌కేఆర్‌ 20` సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మాణంలో చేస్తున్నారు. దీనికి తనకు `118` వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన కేవి గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Scroll to load tweet…

ఇవే కాకుండా నవీన్‌ మేడారం దర్శకత్వంలో పీరియాడికల్‌ స్టోరీతో `డెవిల్‌` చిత్రాన్ని చేస్తున్నారు. దీన్ని `ఎన్‌కేఆర్‌ 21`వ చిత్రంగా అభిషేక్‌ పిక్చర్స్ నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ విడుదలైంది. లుక్‌ చూస్తుంటే గూస్‌బమ్స్ వచ్చేలా ఉన్నాయి. బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ నేపథ్యంలో ఈ `డెవిల్‌`చిత్రం రూపొందుతుంది. ఆనాటి కాలంలో ట్రైన్‌లో నుంచి పంచెకట్టు, కోట్‌ ధరించి గన్‌ ఎక్కుపెట్టి కోపంగా కనిపిస్తున్నాడు కళ్యాణ్‌రామ్‌. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మరోవైపు ఈస్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్‌ కోనేరు నిర్మాణంలో ఓ సినిమాని తన `ఎన్‌కేఆర్‌ 22` చిత్రం చేయబోతున్నారు. ఇది వచ్చే ఏడాదిసెట్స్ పైకి వెళ్లనుంది. ఇలా బ్యాక్‌టూ బ్యాక్‌ బర్త్ డే సందర్భంగా నాలుగు సినిమాలను ప్రకటించిన సర్‌ప్రైజ్‌ చేశారు కళ్యాణ్‌రామ్‌. ఈ లెక్కన ప్రస్తుతం కళ్యాణ్‌రామ్‌ ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. 

Scroll to load tweet…