‘బింబిసార’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. తాజాగా తన 19వ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న నంమూరి కళ్యాణ్ రామ్ తాజాగా టైమ్ ట్రావెల్ ఫిల్మ్ ‘బింబిసార’(Bimbisara)తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. ఎన్నో ఏండ్లుగా మంచి హిట్ కోసం చూస్తుండగా ‘బింబిసార’తో నెరవేరింది. ఈ ఒక్కచిత్రంతో కళ్యాణ్ రామ్ క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో ఆయన తదుపరి చిత్రాలపై అభిమానులు, ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు ఏకంగా మూడు చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో NKR19 ఒకటి.
తాజాగా ఈ చిత్రం టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చిత్రాలపై పెరుగుతున్న అంచనాలను రీచ్ అయ్యేలా ‘అమిగోస్’ (Amigos)అనే టైటిల్ ను ఖరారు చేశారు. చిత్రం టైటిల్ తో పాటు అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 10, 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘బింబిసార’లో ద్విపాత్రాభినయం చేసిన కళ్యాణ్ రామ్.. ‘అమిగోస్’లో ఏకంగా మూడు పాత్రల్లో నటించనున్నారు. చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. అలాగే కళ్యాణ్ రామ్ మూడు పాత్రలూ ఆసక్తికరంగానే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఇక `ఎన్‌కేఆర్ 20` సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మాణంలో చేస్తున్నారు. దీనికి `118` హిట్ చిత్రాన్ని అందించిన కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే నవీన్ మేడారం దర్శకత్వంలో పీరియాడికల్ స్టోరీతో `డెవిల్` అనే చిత్రంలో నటిస్తున్నారు. దీన్ని `ఎన్‌కేఆర్ 21`వ చిత్రంగా అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తుంది. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ నేపథ్యంలో `డెవిల్`చిత్రం రూపొందుతుంది. అలాగూ ఈస్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మాణంలో `ఎన్‌కేఆర్ 22` చిత్రం కూడా రాబోతోంది. ఇది వచ్చే ఏడాదిసెట్స్ పైకి వెళ్లనుంది. ఇలా బ్యాక్‌టూ బ్యాక్ నాలుగు సినిమాలను గతంలోనే ప్రకటించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తున్నారు.
