Asianet News TeluguAsianet News Telugu

బాబీకి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య.. వైరల్ అవుతున్న న్యూస్ లో నిజమెంత..?

సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. బాలయ్య బాబు (Balakrishna)కు కోపం వచ్చింది. డైరెక్టర్ బాబీకి వార్నింగ్ ఇచ్చాడంటూ న్యూస్ హైలెట్ అవుతోంది. ఇంతకీ బాలయ్యకు అంత కోపం ఎందుకు వచ్చింది..? 
 

Nandamuri Balakrishna Warning To Director Bobby Crazy Rumors Viral JMS
Author
First Published Sep 8, 2023, 11:30 AM IST

 బాలయ్య అంటే చిన్నపిల్లాడి మనస్తత్వం అంటారు అంతా.. ఆయన సినిమా చేస్తున్నాడు అంటే అన్నీ ఆలోచించే చేస్తాడు. ముఖ్యంగా కొత్త దర్శకుడితో  సినిమా చేసినా.. కామ్ గా అతను చెప్పింది చేస్తాడు.. పేకప్ చెప్పిన తరువాతే క్యారెవాన్ లోకి వెళ్తాడు.. అంతే కాని దర్శకత్వంలో వేలు పెట్టి.. టీమ్ ను ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టడం బాలయ్యకు అలవాటు లేదు.  కాని కోపం వస్తే మాత్రం ఆయన ఉగ్ర నరసింహుడు అయిపోతాడు.. ఎవరు ఏంటీ అనేది చూడడు. ముందు ఉన్నవారిపని అంతే.. 

బాలకృష్ణ ఏదైనా విషయంలో కోపం వస్తే అక్కడ ఎంత పెద్దవారైనా ఉండని అలాగే ఎంతమందిలో ఉండని తన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పటికే తన అభిమానుల విషయంలో చాలా సార్లు బాలకృష్ణ కోపంగా ప్రవర్తించిన సంగతి మనకు తెలిసిందే. ఎంతో మంది ఫ్యాన్స్ బాలయ్యను విసిగించి.. ఆయన చేత చెంపదెబ్బలు కూడా తిన్నారు. ఈ విషయంలో బాలకృష్ణ విమర్షలు ఎదుర్కొన్నా.. ఆయన చేత దెబ్బలు తినడం కూడా లక్కే అంటూ.. ఫ్యాన్స్ మురిసిపోతుంటారు. ఈక్రమంలో బాలయ్య కు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.  

 బాలకృష్ణ (Balakrishna) ఓ స్టార్ డైరెక్టర్ పై కోపాన్ని ప్రదర్శించారు అంటూ తాజాగా ఒక వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. స్టార్ డైరెక్టర్ బాబి పై  బాలయ్య కోప్పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈయన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి  తెలిసిందే. ప్రస్తుతం ఆయన బాలయ్యతో ఓ మూవీ చేస్తున్నాడు. 

బాబి బాలకృష్ణతో NBK 109 సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమాకి సంబంధించి బాబి స్వయంగా తానే కొన్ని డైలాగులు రాసి తన దగ్గర ఉండే టీం ని బాలకృష్ణ  దగ్గరికి పంపించి ఆ డైలాగులు ఎలా ఉన్నాయో చూడమని చెప్పారట.అయితే ఆ డైలాగులు చూసి బాలకృష్ణకి చాలా కోపం రావడంతో తన దగ్గరికి వచ్చిన టీం ని కోపంతో తిట్టి పంపించేసారట. ఈ న్యూస్ లో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios