ప్రముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను (YS Jagan) కలవడానికి తనను రమ్మని పిలిచినట్టుగా బాలకృష్ణ చెప్పారు.

ప్రముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను (YS Jagan) కలవడానికి తనను రమ్మని పిలిచినట్టుగా బాలకృష్ణ చెప్పారు. కానీ తాను రానని చెప్పినట్టుగా వెల్లడించారు. తాను సినిమా బడ్జెట్ పెంచనని బాలకృష్ణ తెలిపారు. తాను సీఎం జగన్‌ను కలవనని స్పష్టం చేశారు. టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పుడే అఖండ సినిమా సక్సెస్ అయిందన్నారు. ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. 

ఇక, చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కొరకు చిరంజీవి(Chiranjeevi) అధ్యక్షతన ప్రముఖులు ఫిబ్రవరి 10న ఏపీ సీఎం జగన్ ని కలిశారు. మహేష్ (Mahesh), ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, ఆర్ నారాయణమూర్తి, ఆలీ వంటి ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎంతో భేటీ అనంతరం చర్చలు ఆశాజనకంగా ముగిశాయని, టికెట్స్ ధరలతో పాటు పలు పరిశ్రమ సమస్యలకు పరిష్కారం దొరికినట్లే అని చిరంజీవితో పాటు మిగతా ప్రముఖులు మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. 

ఆ తర్వాత పేర్నినాని మోహన్ బాబు ఇంటికెళ్లడంపై పలు రకాల వార్తలు వచ్చాయి. మిత్రుడైన పేర్ని నాని తన ఇంటికి రావడం కూడా రాజకీయం చేస్తారా అంటూ మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. 

కట్ చేస్తే నేడు మంచు విష్ణు.. ఎస్‌ జగన్‌ను మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇది పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న అధికారిక భేటీనా? లేక పూర్తిగా వ్యక్తిగత భేటీనా? అనేది తెలియాల్సి ఉంది. మంచు విష్ణు మీడియాతో మాట్లాడితే కానీ ఈ విషయంపై క్లారిటీ రాదు. మంచు విష్ణు.. సీఎం జగన్ బంధువనే సంగతి తెలిసిందే.