గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అని మోక్షజ్ఞ తిట్టాడు.. శ్రీలీల వల్లే, దసరాకి దంచుదాం : బాలయ్య 

నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే.

Nandamuri Balakrishna interesting speech at Bhagavanth Kesari trailer launch event dtr

నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే. అందులోనూ వీరసింహారెడ్డి హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అనిల్ రావిపూడి బాలయ్యని ప్రజెంట్ చేస్తున్న విధానం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. 

నేడు వరంగల్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో బాలయ్య ఎప్పటిలాగే ఎనెర్జిటిక్ గా ప్రసంగించారు. వరంగల్ చరిత్ర గురించి మాట్లాడుతూ తన స్పీచ్ ప్రారంభించారు. తాను తొలిసారి తెలంగాణ యాసలో నటించిన చిత్రం అని బాలయ్య అన్నారు. వీరసింహారెడ్డి తర్వాత ఎలాంటి చిత్రం చేయాలని అనుకుంటుండగా.. సరైన చిత్రం దొరికింది. ఈ చిత్రం నా అభిమానులకు విందు భోజనంలా ఉంటుంది అని బాలయ్య అన్నారు. 

అనంతరం తన తండ్రి నందమూరి తారకరామారావుని గుర్తు చేసుకుంటూ ఆయన నానా జాతులకు ఆరాధ్య దైవం అని తెలిపారు. ట్రైలర్ చూసింది కొంచెమే.. చిత్రంలో చాలా దాచిపెట్టాం అని బాలయ్య అన్నారు. దసరాకి ముందు తప్పకుండా దంచుదాం అని హూషారెత్తించారు. చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు చేశానంటే అది అమ్మవారి ఆశీస్సులు నా అదృష్టంగా భావిస్తాను అని బాలయ్య అన్నారు. 

నేను అనిల్ రావిపూడి సెట్స్ లో జోకులు వేసుకున్నాం. ఆయన నాతో కాస్త భయపడ్డారు. నెక్స్ట్ అనిల్ రావిపూడితో కామెడీ మూవీ చేస్తా. నేను కామెడీలో కూడా కింగ్ ని. అనసూయమ్మ గారి అల్లుడు, మంగమ్మ గారి మనవడు లాంటి చిత్రాలు చేశాను అని బాలయ్య సరదాగా చెప్పారు. 

ఇక కాజల్, శ్రీలీల నటనని బాలయ్య ప్రశంసించారు. ఇక శ్రీలీలతో నెక్స్ట్ ఆమె హీరోయిన్ గా, నేను హీరోగా చేయాలని ఉందని బాలయ్య నవ్వించారు. ఈ విషయం ఇంట్లో చెబితే మోక్షజ్ఞ నన్ను తిట్టాడు. ఏం డాడీ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా.. నెక్స్ట్ కుర్ర హీరోని నేను వస్తున్నాను కదా అని తిడుతున్నాడు అంతో బాలయ్య చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్య పరచడమే కాదు నవ్వులు పూయించాయి. ఈ చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని బాలయ్య పేరు పేరునా అభినందించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios