వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. వరుస సినిమాలు చేయడమే కాదు వరుస సక్సెస్ లు కూడా సాధిస్తున్నాడు. ఈక్రమంలో ఆయన తన రెమ్యూనరేషన్ ను పెంచినట్టు తెలుస్తోంది. 

బాలయ్య బాబు అంత త్వరగా రెమ్యూనరేషన పెంచడు. నిర్మాతల గురించి ముందు వెనుక ఆలోచిస్తుంటారు బాలయ్య. ఈక్రమంలో యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ..వరుస సినిమాలు చేస్తూ.. వరుస సక్సెస్ లు సాధిస్తున్నాడు బాలకృష్ణ. ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల దగ్గరనుంచి చిన్న హీరోల వరకూ తమ రేటును పెంచుకుంటూ వస్తున్నారు. బాలయ్య ఇమేజ్ కు ఇప్పటికీ 50 కోట్లు దాటాల్సింది.. ఆయన పెంచుకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతున్నాడు. 

ఇక తాజాగా బాలకృష్ణ తన రెమ్యూనరేషన్ పెంచినట్టు తెలుస్తోంది. అఖండ సినిమా నుంచి మంచి జోష్ మీద ఉన్నాడు బాలయ్య. ఆ సినిమా దగ్గర నుంచి వరుసగా నాలుగు సినిమాల వరకూ కమిట్ అయ్యాడు. అఖండ తరువాత రీసెంట్ గా వచ్చిన వీరసింహారెడ్డి కూడా అదరగొట్టింది. భారీగా కలెక్షన్లు సాధించింది. దాంతో బాలయ్య ఈసారి రెమ్యూనరేషన్ పెంచకతప్పలేదు. ప్రస్తుతం బాలయ్య బాబు అనిల్ రావిపైడి సినిమా చేయబోతున్నాడు. ఈక్రమంలోనే మొన్నటివరకూ సినిమాకు 15 కోట్లు వరకూ తీసుకున్న బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమా నుంచి 20 కోట్లు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 

బాలయ్య సినిమాలకు కలెక్షన్లు పెరిగాయి. అఖండ 100కోట్ల మార్క్ ను ఈజీగా క్రాస్ చేసింది. వీరసింహారెడ్డికి కూడా 100 కోట్లు పెద్దగా కష్టపడకుండానే బయటపడింది. దాంతో బాలయ్య సినిమాలకు రేటు భారీగా పెరిగిపోతుంది. ఇక ఇదే జోష్ తో బాలకృష్ణ ముందు ముందు కూడా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలస్తోంది. అనిల్ రావిపూడి తరువాత ఓ యంగ్ డైరెక్టర్ తో బాలయ్య సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. 

ఇక అటు బాలకృష్ణతో సినిమాచేయడం కోసం సీనయిర్ డైరెక్టర్లు కూడా రెడీ అవుతున్నారు. పూరీ జగన్నాథ్ , బాలయ్య కాంబో మూవీ ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. కాని దానికి ముహూర్తం కుదరడంలేదు. గతంలో పైసా వసూల్ తో రచ్చ రచ్చ చేసిందీ కాంబో. దాంతో ఈసారి అంతకు మించి చేయాలని చూస్తున్నారు టీమ్. చూడాలి మరి బాలకృష్ణ ముందు ముందు ఎలాంటి హిట్లు సాధిస్తారో.