Asianet News TeluguAsianet News Telugu

సక్సెస్ లేక అల్లాడుతున్న సందీప్ కిషన్ కు బాలయ్య సాయం

కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంతో బాలయ్య తరువాతే ఎవరైనా.. అది బయట వాళ్లు అయినా.. ఇండస్ట్రీవాళ్లు అయినా. ఇక తాజాగా సక్సెస్ లేక ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో సందీప్ కిషన్ కు సాయం చేయడానికి రెడీ అయ్యారు బాలయ్య. 
 

Nandamuri Balakrishna Helps Young Hero Sundeep Kishan
Author
First Published Jan 22, 2023, 10:39 AM IST

సినిమా వాళ్ళైనా, బయటి వాళ్ళైనా, ఎవరైనా సరే.. బాలయ్య అంటూ వెళ్లిన వాళ్లకు సాయం చేయడంతో నటసింహం వేనగకడుగు వేయరు. హెల్ప్ చేయడంలో బాలయ్య ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమాకి తనవంతు హెల్ప్ చేయడానికి రెడీ అయ్యాడు బాలకృష్ణ. ఏవిధంగా  హెల్ప్ చేయబోతున్నాడంటే.  

కెరీర్ లో పెద్దగా హిట్లు లేవు సందీప్ కిషన్ కి. ఈమధ్య అసలు సినిమాలు చేయడం కూడా మానేశాడు. అప్పుడప్పుడు అలా మెరుస్తున్నాడు. ఈక్రమంలో సందీప్  హీరోగా మైఖేల్ టైటిల్ తో  యాక్షన్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో సందడి చేయబోతున్నాడు యంగ్ స్టార్. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, అనసూయ, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మీ, గౌతమ్ మీనన్ కీలకపాత్రలు పోషించారు.

రంజిత్ జేకొడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  ఫిబ్రవరి 3న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయ్యింది.  ఈ క్రమంలో ప్రయోషన్స్ కు పదును పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా జనవరి 23న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సబంధించిన అనౌన్స్ కూడా చేశారు. ఈ సినిమా ట్రైలర్ ని నటసింహం  గాడ్ ఆఫ్ మాస్ బాలయ్య చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారు. ఇలా చేయాలి అని యంగ్ హీరో అడిగిన వెంటనే.. తప్పకుండా చేస్తానంటూ బాలయ్య అభయం ఇచ్చినట్టుు తెలుస్తోంది. 

 

 

ఆల్రెడీ టీజర్ రిలీజ్ అవ్వగా.. టీజర్ చూసిన ఆడియన్స్ మంచి రివ్యూలు ఇస్తున్నారు. ఈక్రమంలో ట్రైలర్ పై ఆసక్తితో ఉన్నారు. ట్రైలర్ చూసి సినిమాపై అంచనాలు పెరుగుతాయి అని నమ్ముతున్నారు మేకర్స్.  ఈ సినిమాకి ఖైదీ ఫేమ్ సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి బాలయ్య చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అంటే.. మామూలుగా ఉండదని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. 

అటు బాలయ్య కూడా  రీసెంట్ గా వీరసింహారెడ్డి మూవీతో మరో బ్యాక్ బస్టర్ అందుకున్నారు.  నటసింహం బాలకృష్ణ. ఈ ఏడాది సంక్రాంతి బరిలో మాస్ యాక్షన్ మూవీతొ సందడి చేశారు. ఊర మాస్ డైలాగ్స్ తో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఫ్యాన్స్ కి భారీ యాక్షన్  ట్రీట్ ఇచ్చారు బాలయ్. ఆయన కెరీర్ లోనే  54 కోట్ల ఓపెనింగ్స్ తో బిగ్గెస్ట్ నెంబర్ నమోదు చేసింది వీరసింహారెడ్డి సినిమా. అఖండ తర్వాత బాలయ్య కెరీర్ లో  100 కోట్లకు పైగా వసూల్ చేసిన సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈమూవీ తరువాత అనిల్ రావిపూడితో మరో సినిమా చేయబోతున్నాడు బాలయ్య. 
 

Follow Us:
Download App:
  • android
  • ios