టాలీవుడ్‌ టాప్‌ అండ్‌ సీనియర్‌ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ కనిపించకుండా పోయి చాలా రోజులవుతుంది. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా చిత్రపరిశ్రమ పెద్దలపై, సీఎంపై పలు విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కిన బాలయ్య ఆ తర్వత కనిపించడం మానేశాడు. 

ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు కూడా అందుబాటులో లేడనే కామెంట్స్ వినిపించాయి. సొంత నియోజకవర్గ ప్రజల బాగోగులు చూడటం లేదని తీవ్ర విమర్శలు వినిపించాయి. ఇక మీడియాలోనూ ఆయనపై వార్తలు గుప్పుమన్నాయి. ఇన్ని రోజులు కరోనాకి బయపడి ఇంటికే పరిమితమైన బాలకృష్ణ ఎట్టకేలకు స్పందించారు. 

తమ నియోజకవర్గ ప్రజల కోసం 55లక్షల విలువగల మెడిసిన్‌, పీపీఈ కిట్లు, మాస్క్ లు, ఇతర ఎక్విప్‌మెంట్‌ విరాళంగా అందించారు. వైరస్‌తో ముందుండి పోరాడుతున్న హిందూపూర్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వీటిని అందిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్‌ విరాళంగా గతంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు విరాళంగా అందించిన విషయం తెలిసిందే. సీసీసీకి కూడా తన వంతు విరాళం ప్రకటించాడు. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.