షూటింగ్స్ కు బాలయ్య లాంగ్ బ్రేక్.. కారణం ఏంటో తెలుసా..?
కుర్రహీరోలను స్టార్ హీరోలను భయపెడుతూ.. దూసుకుపోతున్నాడు బాలయ్య.. యమాజోరుమీద షూటింగ్స్ చేసుకుంటూ వెళ్తోన్న ఈసీనియర్ స్టార్ హీరో.. షూటింగ్స్ కు ఓ రెండు నెలలు బ్రేక్ ఇద్దాంఅనుకుంటున్నాడు. కారణం ఏమంటే..?
వరుస సినిమాలతో టాలీవుడ్ ను శేక్ చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. నిజంగా నటసింహం అనిపించుకున్నాడు. 60 ఏళ్ళుదాటిన వయస్సులో కూడా ఏమాత్రం తగ్గకుండా.. హాట్రిక్ హిట్ కొట్టి చూపించాడు. ముందు ముందు సినిమాలను కూడా ఆలోచించి సైన్ చేస్తున్నాడు. దర్శఖులు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. మరో హ్యాట్రిక్ హిట్ టార్గెట్ గాదూసుకుపోతున్నాడు బాలయ్య బాబు. ఇక తాజాగా ఆయన బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నా ఈసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక నెక్ట్స మూవీస్ కు సబంధించి త్వరలో అప్ డేట్ ఇవ్వబోతున్నాడు. ఈక్రమంలో బాలయ్య సంబంధించినఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్న బాలకృష్ణ.. నెక్ట్స్ రెండు నెలలు షూటింగ్స్ కు లాంగ్ బ్రేక్ ఇవ్వాలి అనుకుంటున్నాడట. దానికి కారణంఏంటంటే.. ఎలక్షన్స్. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుండడంతో... ప్రచారానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఇప్పటికే బాలయ్య హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక అక్కడి నుంచే మరోసారి పోటీ చేయడంతో పాటు.. ఏపీలో తన పార్టీ అధికారంలోకి వచ్చేవిధంగా కార్యమాలు చేయాల్సి ఉందని. దానికోసం బాలయ్య రాష్ట్రమంతా తిరిగే అవకాశం ఉండటంతో.. ఆయన అన్ని షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వబోతున్నట్టు తోలుస్తోంది. అయితే మేకర్స్ ఇబ్బంది పడకుండా.. బాలయ్య లేని సన్నివేశాలు చిత్రీకరించాలని ప్లనా్ చేశారట దర్శకులు. అయితే ఈ సంవత్సరం దసరా రేసులో నిలుస్తుందట ఈ సినిమా. గతేడాది దసరాకు భగవంత్ కేసరి సినిమాతో హిట్ కొట్టిన బాలయ్య ఈ సంవత్సరం అంతకు మించి హిట్ అందుకోవడానికి సిద్దమయ్యారనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.
బాలయ్య బాబీ కాంబో మూవీ బడ్జెట్ కూడా అంతకంతకూ పెరుగుతోందని సమాచారం. ఇక బాలయ్య వరుస విజయాలు సాధించిన నేపథ్యంలో సితార నిర్మాతలు ఈ సినిమా విషయంలో రాజీ పడడం లేదు. ఈయన మాస్ సినిమాల్లో నటిస్తే భారీ విజయాలు సొంతం అవుతాయనే టాక్ ఉండడంతో బాబీ సినిమా కూడా అదే తరహాలో రానుందట. ఇదిలా ఉంటే ఈ స్టార్ హీరో హిందూపురంతో పాటు ఏపీలోని ప్రముఖ జిల్లాలలో పర్యటించనున్నారని టాక్.
బాలయ్య సినిమాల్లో ఏ విధంగా సక్సెస్ సాధిస్తున్నారో.. ఈ సారి కూడా పొలిటికల్ గా కూడా అదే రేంజ్ లో సక్సెస్ ను సాధించాలి అనుకుంటున్నారు అభిమానులు. రూ. 30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న బాలయ్య టీవీ యాడ్స్, ఓటీటీ షోల ద్వారా అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. సీనియర్ హీరోలలో టాప్ రేంజ్ లో స్థానం సంపాదించి తన సత్తా చాటుతున్నారు.