వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల ఫైట్ ఇప్పటికే హాట్ టాపిక్ అవ్వగా ఇప్పుడు నందమూరి హీరో కూడా అదే ఫెస్టివల్ ని టార్గెట్ చేసి ఫైట్ డోస్ ఇంకాస్త పెంచుతున్నాడు. గత కొంత కాలంగా అపజయాలతో సతమతమవుతున్న నందమూరి హీరో కళ్యాణ్ ప్రస్తుతం ఎంత మంచి వాడవురా! అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

శతమానం భవతి సినిమాతో 2017 సంక్రాంతికి మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఆ తరువాత నితిన్ తో చేసిన శ్రీనివాస కళ్యాణ్ బెడిసికొట్టింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాతో సంక్రాంతి సెంటిమెంట్ గా మళ్ళీ తన లక్కును పరీక్షించుకోబోతున్నాడు. అయితే పొంగల్ బరిలో ముందుగానే స్టార్ హీరోలు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అప్పుడే రాబోతోంది. 

అలాగే మహేష్ - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా సంక్రాంతికే రానుంది. వీటితో పాటు మరో రెండు పెద్ద సినిమాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సూపర్ స్టార్ స్టైలిష్ స్టార్ అయితే సంక్రాంతికి రావాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా ఫిక్స్ అయినట్లు చిత్ర యూనిట్ ఎనౌన్స్మెంట్ తో అర్ధమయ్యింది. మరి ఈ బిగ్ ఫైట్ లో ఏ హీరో క్లిక్కవుతాడో చూడాలి.