ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ తల్లి నిర్మలా పాటేకర్(99)  ముంబైలో కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం ఆమెకు ముంబైలో అంత్యక్రియలు నిర్వహించారు. నిర్మలా పాటేకర్ మరణించిన సమయంలో నానా పాటేకర్ ఇంట్లో లేరని సమాచారం.

విషయం తెలిసిన తరువాత ఆయన ఇంటికి చేరుకున్నారు. నానా పాటేకర్ తన 28 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. ఇప్పుడు తన తల్లిని కూడా దూరం చేసుకున్నారు. నానా పాటేకర్ తన తల్లికి అంత్యక్రియలు నిర్వహిస్తోన్న ఫోటోలు బయటకి వచ్చాయి.

ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వృద్ధాప్యం కారణంగా నిర్మలా పాటేకర్ మరణించినట్లు తెలుస్తోంది.