ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ఈ సినిమాలో  ముఖ్యమైన పాత్రల కోసం తమిళనటుడు సత్యరాజ్ .. మలయాళ నటుడు జయరామ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, సీనియర్ నరేశ్ లను తీసుకున్నారు.  

అలాగే హిందీ మార్కెట్ కోసం ఇప్పటికే టబుని సీన్ లోకి తెచ్చిన త్రివిక్రమ్ ..అందుతున్న సమాచారం మేరకు నానా పటేకర్ ని సైతం తమ సినిమా కోసం అడిగినట్లు సమాచారం. ఇండియాలో సపోర్టింగ్ రోల్స్ కు టాప్ పెయిడ్  యాక్టర్ ఆయన.

ఉపేంద్ర హ్యాండ్ ఇవ్వటంతో నానా పటేకర్ తో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. సినిమాలో అల్లు అర్జున్ కు తండ్రి పాత్రలో నానా పటేకర్ కనపడతారని చెప్పుకుంటున్నారు.  అయితే నానా పటేకర్ ఇప్పటికే మీటూ వివాదంలో ఉన్నారు. ఆయన్ని తీసుకోవటం వల్ల సమస్యలు ఏమన్నా ఉత్పన్నం అవుతాయా అని అందరూ అనుమానిస్తున్నారు. 

ఇక సత్యరాజ్ ని తీసుకోవటం ద్వారా తమిళ మార్కెట్ ని, జయరామ్ ని తీసుకోవటంతో మళయాళ మార్కెట్ ని, టబు, నానా పటేకర్ తో తో హిందీ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారట. 

యాక్షన్ .. భావోద్వేగాలతో కూడిన కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే , ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నారు.