మహేష్ తన గారాల పట్టి సితారతో ఫన్ టైమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. సరదాగా కబుర్లు చెబుతున్నారు. సితార మాట్లాడే ముద్దు ముద్దు మాటలు వింటూ తండ్రిగా మంచి అనుభూతిని పొందుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం కరోనా వల్ల ఇంటికే పరిమితమై ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా తమ పిల్లలు గౌతమ్, సితారలో సరదాగా గడుపుతున్నారు. వీరిద్దరిలో ఎక్కువగా మహేష్ తన గారాల పట్టి సితారతో ఫన్ టైమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. సరదాగా కబుర్లు చెబుతున్నారు. సితార మాట్లాడే ముద్దు ముద్దు మాటలు వింటూ తండ్రిగా మంచి అనుభూతిని పొందుతున్నారు.
తాజాగా అలాంటి సరదా, ఫన్నీ మూవ్‌మెంట్ మహేష్ ఇంట్లో చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం సితార ల్యాప్‌టాప్‌లో ఏదో ఫన్నీ వీడియోలు చూస్తుండగా, మహేష్ ఆమె దగ్గరకు వెళ్ళి సితార ఏం చూస్తుందనేది గమనిస్తున్నాడు. దీంతో సితార నవ్వుతూ మహేష్‌పై ఓ కాలు వేసింది. సన్నివేశాన్ని నమ్రతా కాప్చర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్‌లో ఈ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నమ్రతా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా `సితార డాడీ గర్ల్` అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
మహేష్ గారాల పట్టి సితార గతేడాది యానిమేషన్ చిత్రం `ఫ్రోజెన్ 2`లో బేబీ ఎల్సాకి వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే.
