మహేష్‌బాబు భార్య, మాజీ హీరోయిన్‌ నమ్రత ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను, ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు. అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్‌, గౌతమ్‌, సితారల ఫోటోలను షేర్‌ చేస్తుంది. తాజాగా మరో అరుదైన ఫోటోని పంచుకుంది నమ్రత. అంతేకాదు తమ ఇంట్లో ఉన్న అందరు అబ్బాయిలు అంటూ ఓ ఫోటోని పంచుకున్నారు. 

ఇందులో మహేష్‌, గౌతమ్‌ని సరదాగా ఉన్న సమయంలో తీసిన ఫోటో ఇది. మహేష్‌ ఇందులో చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. ఈ థ్రో బ్యాక్‌ ఫోటో ఇప్పుడు విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే వీరి వద్ద పెంచుకునే డాగ్‌ కూడా ఉంది. నమ్రత లెక్క ప్రకారం అది కూడా మేల్‌ డాగ్‌ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A rare one.. all the boys in the house 😍😍😍 @urstrulymahesh @gautamghattamaneni

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Nov 6, 2020 at 1:58am PST

ఇదిలా ఉంటే ఈ ఏడాది సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో సందడి చేసిన మహేష్‌ ఇప్పుడు `సర్కారు వారి పాట`లో నటిస్తున్నారు. ఇది త్వరలో షూటింగ్‌ ప్రారంభించుకోబోతుంది. పరశురామ్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుండగా, ఆయన సరసన కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.