సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత ఇప్పటివరకు తన భర్తకి సంబంధించిన సినిమా వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంది. రెమ్యునరేషన్స్, సినిమా రిలీజ్, ప్రమోషన్స్ ఇతరత్రా విషయాలపై ఫోకస్ పెట్టేది. అయితే ఇప్పుడు ఈమె పూర్తి స్థాయి నిర్మాతగా మారే ఆలోచనలో ఉంది.

సూపర్ స్టార్ కి సంబంధించిన బ్యానర్ లు ప్రస్తుతం యాక్టివ్ గా లేవు. మహేష్ బాబు, నమ్రత కలిసి 'జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్' బ్యానర్ పై సినిమాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో అడివి శేష్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేశారు.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. అనీల్ రావిపూడి- మహేష్ కాంబోలో వస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి కూడా నిర్మాణంలో భాగం తీసుకుంది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ బ్యానర్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఈ బ్యానర్ కోసం హైదరాబాద్ లో ఓ లగ్జరీ ఆఫీస్ కూడా తీసుకున్నారు.

ఇకనుండి నమ్రత అక్కడ నుండి నిర్మాణ వ్యవహారాలు చూసుకోబోతున్నారు. ఇప్పటికే కథలకు సంబంధించిన చర్చలు కూడా నడుస్తున్నాయి. ఈ బ్యానర్ పై వెబ్ సిరీస్ కూడా  తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ విధంగా నమ్రత టాలీవుడ్ లో బిజీ నిర్మాతగా మారబోతుంది.