కరోన కారణంగా షూటింగ్‌లు ఆగిపోవటంతో సినీ తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ ఫ్యామిలీకి దూరంగా ఉండే స్టార్స్‌ ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేసేందుకు ఇంట్రస్ట్  చూపిస్తున్నారు. అంతేకాదు ఈ గ్యాప్‌లో ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టారు స్టార్స్‌. అంతేకాదు అభిమానులను ఇన్‌స్పైర్‌ చేసేందుకు  తమ వర్క్ అవుట్‌ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు వర్క్‌ అవుట్స్‌కు సంబంధించి ఆయన భార్య నమ్రత శిరోద్కర్‌ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది. మహేష్ ఇంట్లో ఉండకపోతే ఇక్కడే ఉంటాడంటూ జిమ్‌ వీడియోను షేర్ చేసింది నమత్ర. అయితే ఆ వీడియో గతంలో షేర్ చేసిందే కావటంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు. కానీ వర్క్‌ అవుట్స్ విషయంలో మహేష్ ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాడో క్లారిటీ ఇచ్చింది మహేష్ బాబు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మొదట్లోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు షార్ట్ గ్యాప్ తరువాత పరుశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారిపాట సినిమాను ఎనౌన్స్ చేశాడు, అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.