Asianet News TeluguAsianet News Telugu

మా బంధం అందుకే దృఢంగా ఉంది... సీక్రెట్ రివీల్ చేసిన నమ్రత!

వంశీ మూవీలో హీరోయిన్ గా నటించిన నమ్రత ప్రేమలో పడ్డ మహేష్ ఐదేళ్లు ఆమెతో రిలేషన్ లో ఉన్నారు. ఐదేళ్ల డేటింగ్ తరువాత వీరు రహస్య వివాహం చేసుకున్నారు. మహేష్ తో దృఢమైన తన పెళ్లి బంధం వెనుకున్న రహస్యం ఏమిటో నమ్రత తెలియజేశారు.

namrata reveals reason behind strong bonding with mahesh ksr
Author
Hyderabad, First Published Feb 10, 2021, 3:25 PM IST

మహేష్-నమ్రతల పెళ్లి బంధానికి 16ఏళ్ళు. 2005 ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్న ఈ జంట 16ఏళ్ల ఆనందకర వైవాహిక జీవితం పూర్తిచేశారు. వంశీ మూవీలో హీరోయిన్ గా నటించిన నమ్రత ప్రేమలో పడ్డ మహేష్ ఐదేళ్లు ఆమెతో రిలేషన్ లో ఉన్నారు. ఐదేళ్ల డేటింగ్ తరువాత వీరు రహస్య వివాహం చేసుకున్నారు. 

పెళ్లి తరువాత నమ్రత సినిమాలకు బై చెప్పి ఇంటికే పరిమితం అయ్యారు.  పెళ్ళైన ఏడాదికి 2006లో గౌతమ్ జన్మించగా, 2012లో కూతురు సితార పుట్టడం జరిగింది. నమ్రత ప్రస్తుతం మహేష్ బాబుకు అనధికారిక సలహాదారుగా, మేనేజర్ గా ఉంటున్నారు. మహేష్ సినిమాల ఎంపిక, రెమ్యూనరేషన్, యాడ్స్ మరియు నిర్మాణ సంస్థలో తెరకెక్కే సినిమాలు వంటి బాధ్యలు నెరవేరుస్తున్నారు. 

ఇక మహేష్ తో దృఢమైన తన పెళ్లి బంధం వెనుకున్న రహస్యం ఏమిటో నమ్రత తెలియజేశారు. ఒకరిపై ఒకరి నమ్మకం, ప్రేమ, విశ్వాసం తమ బంధాన్ని దృఢంగా మార్చాయని చుబుతూ.. మహేష్ ని విష్ చేసిన నమ్రత,  ఓ రొమాంటిక్ పిక్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. యానివర్సరీ సందర్భంగా మహేష్, నమ్రత ఒకరిని మరొకరు విష్ చేసుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios