సూపర్ స్టార్ మహేశ్ బాబు - నమ్రతా శిరోద్కర్ స్టార్ కపుల్ గా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఇప్పటికే మహేశ్ బాబు తన తండ్రిని విష్ చేశారు. కాగా నమ్రతా మహేశ్ బాబు గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.
బాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) పెళ్లి తర్వాత తన నటనా జీవితానికి దూరమయ్యారు. ముంబయి కి చెందిన నమ్రతా తెలుగు నటించింది రెండే చిత్రాలు. అందులో తొలుత సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో కలిసి ‘వంశీ’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత మెగా స్టార్ చిరంజీవితో ‘అంజి’ మూవీలో మెరిసింది. వంశీ మూవీ నుంచి మహేశ్ బాబు, నమ్రతా డేటింగ్ ప్రారంభం కాగా.. ఐదేండ్ల తర్వాత ఇద్దరు పెద్దల సమక్షంలో 2005లో పెళ్లి కూడా చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి కొడుకు గౌతమ్ ఘట్టమనేని, కూతురు సితారా ఉన్నారు.
నమ్రతా సినిమాలకు దూరంగా కావడంతో మహేశ్ బాబు బిజినెస్ లను చూసుకుంటూ ఉంటుంది. ఎక్కడా లోటుపాట్లు రాకుండా జాగ్రత్తగా డీల్ చేస్తుంది. అలాగే మహేశ్ బాబు ఎంబీ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవాకార్యక్రమాలను కూడా నమ్రతా ఆధ్వర్యంలో కొనసాగుతుంటాయి. ఇక మహేశ్ బాబు అటు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ఇలా వారి దాంపత్య జీవితాన్ని హ్యాపీగా గడుపుతూ.. స్టార్ కపుల్ గా ఇతరులకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు. అయితే నమ్రతా కొన్ని ప్రత్యేక రోజుల్లో మహేశ్ బాబు, తన ఫ్యామిలీ గురించి ఎమోషనల్ అవుతూ ఫోస్ట్ లు పెడుతూ ఉంది.
ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా నమ్రతా మహేశ్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. భర్తతో కలిసి దిగిన సెల్ఫీ పిక్ ను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. ‘నా హృదయపూర్వక మనిషికి మరియు మా పిల్లల తండ్రికి.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఈ జీవితాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.’ అని పేర్కొంది. నమ్రతా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే మహేశ్ బాబు కూడా తన తండ్రికి ఫాదర్స్ డే విషెస్ తెలిపారు. చివరిగా ‘సర్కారు వారి పాట’తో అలరించిన మహేశ్ బాబు.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రారున్న చిత్రాలపై ఫోకస్ పెట్టారు. త్వరలో ఈ చిత్రాల అప్డేట్స్ అందనున్నాయి.
