తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారకరామారావు గారి ప్రస్థానం ఎలాంటితో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన బయోపిక్ తో బాలకృష్ణ గ్యాంగ్ గట్టిగానే హడావుడి చేసే ప్రయత్నం చేస్తోంది. మొదటి భాగం కథానాయకుడు బెడిసికొట్టడంతో మహానాయకుడు సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో అర్ధం కావడం లేదు. 

అయితే మహానాయకుడు ట్రైలర్ తో అయినా జనాలను ఆకట్టుకుంటారా అనుకుంటే ఇప్పుడు వస్తోన్న టాక్ ప్రకారం సినిమా బయ్యర్స్ ని మళ్ళీ భయపెట్టేలా ఉందని మరో టాక్ వైరల్ అవుతోంది. బయోపిక్ అంటే మినిమమ్ ఎమోషన్ తో సాగాలి. ఎంత పెద్ద మహాత్ములు అయినా తప్పటడుగులు వేయకుండా ఉంటారా? బయోపిక్ అంటే ఒక వైపు నుంచే ఆలోచించి తీసే సినిమా కాదు.  అలా తీస్తే సినిమాలో ఏముందని థియేటర్స్ కి వస్తారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. 

కానీ ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ అలానే ఆలోచిస్తున్నారు. ట్రైలర్ లో మెయిన్ విలన్ గా నాదేండ్ల భాస్కర రావును టార్గెట్ చేశారు. ఇక చంద్రబాబు జోలికి పెద్దగా పోలేదు. చివరి రోజుల్లో ఎన్టీఆర్ ఉన్న పరిస్థితిని పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. నాన్నగారికి ఒక మంచి నివాళి గా సినిమాను ప్రజెంట్ చేయాలనుకునే ఆలోచన మంచిదే కానీ అసలు నెగిటివ్ పాయింట్స్ ను ఏ మాత్రం టచ్ చేయకపోవడం షాకింగ్ అని చెప్పాలి. 

చంద్రబాబు పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేయవాల్సి వచ్చిందా లేక అసలు సంగతి ఏమిటనేది రిలీజ్ తరువాత తెలుస్తుంది. కానీ ట్రైలర్ లో కాస్త అయినా ఆడియెన్స్ కి టచ్ ఇవ్వలేదు. సినిమాలో అయితే అయితే చంద్రబాబు గుడ్ బాయ్ లా కనిపిస్తున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫిబ్రవరి 22న రిలీజ్ కానున్న ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో  రానా నటించిన సంగతి తెలిసిందే. మరి సినిమా ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.