అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఓ బేబీ'. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఈ సినిమాలో నాగశౌర్య ముఖ్య పాత్రలో పోషించారు. అతిథి పాత్ర కోసం అతడిని తీసుకున్నప్పటికీ సెట్ లోకి వెళ్లిన తరువాత ఫుల్ లెంగ్త్‌ రోల్ అయిందని చెప్పాడు నాగశౌర్య.

హీరోగా చేస్తూ అతిథి పాత్రలు చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చాడు. నందినీ రెడ్డి మొదట కథ చెప్పడానికి సందేహిస్తుంటే.. తన తల్లి ఒత్తిడి చేసి తనకు నందిని రెడ్డితో కథ చెప్పించిందని.. కథ వినగానే తప్పకుండా హిట్ అయ్యే సినిమా అవుతుందని.. అందులో భాగం కావాలని సినిమా ఒప్పుకున్నట్లు చెప్పాడు.

సమంత గారితో కలిసి పని చేస్తున్నప్పుడు ఓ పెద్ద హీరోయిన్ తో కలిసి పని చేస్తున్నానని అనిపించలేదని.. ఆమె సెట్ లో చాలాసింపుల్ గా ఉంటారని చెప్పుకొచ్చారు. అయితే సినిమాలో సమంతపై  ఉమ్మివేసే సీన్ ఒకటుందని.. నిజంగా సమంతపై ఉమ్మేస్తే.. జనాలు తన మీద ఉమ్మేస్తారని అనుకున్నాడట శౌర్య. కానీ సమంత ఎంతో డెడికేషన్ తో పని చేస్తుందని.. సినిమా కోసమే కదా అని సహకరించడంతో ఆ సీన్ చేసినట్లు వెల్లడించాడు.  

తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఐరా క్రియేషన్స్ లో 'అశ్వత్థామ' సినిమా చేస్తున్నట్లు చెప్పారు. అలానే అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి' సినిమా చేస్తున్నట్లు చెప్పారు. 'పారదు' అనే మరో సినిమా కూడా జరుగుతోందని అన్నారు.