‘రంగబలి’(Rangabali)తో ప్రేక్షకులకు ఓ మంచి సినిమా ఇవ్వనున్నాం. ఈ చిత్ర ఫలితంపై నేను చాలా నమ్మకంగా ఉన్నా. దీని నుంచి నేను బ్లాక్‌బస్టర్‌ తప్ప మరేమీ కోరుకోవట్లేదు


హీరో నాగశౌర్య హోల్ సమ్ ఎంటర్ టైనర్ ‘రంగబలి’. ఈ చిత్రం ద్వారా పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యిందిది. ఈ సినిమా ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ సేల్స్ ని చూస్తే చాలా డల్ గానూ,షాకింగ్ గానూ ఉంది. ముఖ్యంగా క్లాస్ ఆడియన్స్ నుంచి, USA నుంచి నాగశౌర్యకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాంటిది ఈ సినిమా పరిస్దితి రివర్స్ లో ఉంది. అసలు USA అయితే జీరో సేల్స్ కనపడుతున్నాయని అక్కడ ట్రేడ్ అంటోంది. డల్లాస్ లాంటి హై వాల్యూమ్ సెంటర్లలలో కూడా జీరో బుక్కింగ్స్ ఉండటం షాక్ ఇస్తోంది.

మరో రెండు రోజుల్లో రిలీజ్ అవ్వబోతున్నా ఎక్కడా చడీ, చప్పుడూ లేదు. కేవలం సత్య చేసిన స్కిట్ తప్పించి ఈ సినిమాకు ప్రమోషన్ కనపడటం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఓపినింగ్స్ చెప్పుకోదగిన రీతిలో ఉండవని అర్దమవుతోంది. అలాగే పాజిటివ్ టాక్ కనుక మార్నింగ్ షో కు స్ప్రెడ్ కాకపోతే ఎవరూ పట్టించుకునే పరిస్దితి లేదు. అదే జరగితే వచ్చే వారం కూడా సామజవరగమన చిత్రానిదే అని చెప్పాలి. అయితే ‘రంగబలి’సినిమా బాగా వచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ ఉంది. నాగశౌర్య ప్రాణం పెట్టి చేసారని, కొత్త పాయింట్ అని ,విలేజెస్ నుంచి వచ్చేవారంతా కనెక్ట్ అవుతారని అంటున్నారు. 

నాగశౌర్య మాట్లాడుతూ..‘‘రంగబలి’(Rangabali)తో ప్రేక్షకులకు ఓ మంచి సినిమా ఇవ్వనున్నాం. ఈ చిత్ర ఫలితంపై నేను చాలా నమ్మకంగా ఉన్నా. దీని నుంచి నేను బ్లాక్‌బస్టర్‌ తప్ప మరేమీ కోరుకోవట్లేదు’’అన్నారు. అలాగే ‘‘నేను.. సుధాకర్‌ కలిసి సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. పవన్‌ చెప్పిన కథ విన్నాక.. చేస్తే ఇలాంటి కథే చేయాలనిపించింది. చాలా నమ్మకంగా చెబుతున్నా.. దీంతో కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నాం. ఇప్పటి వరకు సుధాకర్‌కు వచ్చిన లాభాల కంటే ఈ చిత్రానికి వచ్చిన లాభాలు ఎక్కువగా ఉంటాయని నమ్మకంగా చెబుతున్నా. యుక్తి చక్కగా నటించింది. సత్య మంచి టైమింగ్‌ ఉన్న నటుడు. ఇందులో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంది. దర్శకుడు పవన్‌ చాలా బాధ్యతగా.. నిజాయతీగా ఈ సినిమా తీశారు. తను పెద్ద దర్శకుడవుతాడు’’ అన్నారు. 

‘‘ఈ చిత్రంలో శౌర్య హీరోయిజం, ఎమోషన్‌ కొత్తగా చూస్తారు. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఈ చిత్రాన్ని పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు దర్శకుడు పవన్‌.