నాగార్జున హిమాలయాల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఏడు నెలల తర్వాత బయటకు వెళ్లిన ఆయన లాక్‌డౌన్‌లో నుంచి బయటపడ్డ ఫీలింగ్‌ని అనుభవిస్తున్నారు. ప్రతిష్టాత్మక మౌంటేన్స్ లో తాజాగా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నాగార్జున ఓ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 

ఇందులో నాగార్జున హిమాలయాల్లోని మూడు వేల ఎనిమిది వందల తొంబై మీటర్ల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాల్లో ప్రస్తుతం తాను ఉన్నట్టు తెలిపారు నాగ్‌. అది చాలా ప్రమాదకరమైన పర్వాత ప్రాంతమట. నవంబర్‌ నుంచి మే వరకు దాన్ని మూసేస్తారట. ప్రస్తుతం `వైల్డ్ డాగ్‌` షూటింగ్‌ కోసం అక్కడికి వెళ్ళినట్టు, షూటింగ్‌ చాలా బాగా జరుగుతుందని, అందమైన పర్వతాలు, ఆకాశం, వాటర్‌ఫాల్స్ ఎంతో అందంగా ఉన్నాయని చెప్పారు నాగ్‌. 

ఏడు నెలల తర్వాత ఇలాంటి ప్లేస్‌కి రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 21డేస్‌లో షూటింగ్‌ పూర్తవుతుందట. ఆ తర్వాత వస్తామని నాగార్జున ఈ వీడియో తెలిపారు. `వైల్డ్ డాగ్‌`ని సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగార్జున ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, లుక్స్ ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ్‌ స్టార్‌మాలో ప్రసారమయ్యే `బిగ్‌బాస్‌4`కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరి మూడు వారాలపాటు హిమాలయాల్లో ఉంటే `బిగ్‌బాస్‌` నాల్గో సీజన్‌కి ఈ మూడు వారాలు ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా మారింది. ఆయన స్థానంలో సమంత రానుందని, రోజా వస్తారనే ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎవరు వస్తారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.