శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బిగ్‌బాస్‌కి విశేషమైన క్రేజ్‌ ఉందని చెప్పారు. గుంటూరులో ఒకరికి బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేస్తుంటే బిగ్‌బాస్‌ చూపించారని వెల్లడించారు. బిగ్‌బాస్‌ చూస్తున్నప్పుడు మాత్రమే తాను కాన్‌సన్‌ట్రేట్‌గా చూడగలనని తెలిపాడు. పేషెంట్‌ అడిగి మరీ బిగ్‌బాస్‌ పెట్టించుకుని చూస్తే ఆపరేషన్‌ సక్సెస్ ఫుల్‌ పూర్తి చేసుకున్నారని తెలిపాడు. బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్‌ ఏంటో తెలిపారు. 

మరోవైపు రోజులు దగ్గరపడుతున్నాయని, ఉత్కంఠ పెరిగిందన్నారు. ఒప్పుడు హౌజ్‌లో ఉన్న ఏడుగురు సూపర్‌ సెవెన్‌ అని తెలిపారు. ఈ వారం చేసిన మిస్టేక్స్ ఏంటో సభ్యుల చేత చేయించి వారికి ఇవ్వాల్సిన వార్నింగ్‌, సలహాలు ఇచ్చారు. తనకు అందరూ ఇష్టమని చెప్పాడు. మూడు వారాలే ఉందని, చాలా జాగ్రత్తగా, తమ కోసం గేమ్‌ ఆడాలని తెలిపాడు. అభిజిత్‌కి, హారికకి ప్రత్యేకంగా క్లాస్‌ పీకాడు నాగార్జున. 

ఈ వారం 9.4కోట్ల ఓటింగ్‌ వచ్చాయని చెప్పాడు. ఎలిమినేషన్‌ సేవింగ్‌ ప్రక్రియలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అరియానా, మోనాల్‌, అఖిల్‌, అవినాష్‌ నామినేషన్‌లో ఉండగా, వారిలో మోనాల్‌ సేవ్‌ అయ్యారు. దీంతో ఓటింగ్‌ ఊహించని విధంగా వస్తుందని, వారం వారం లెక్కలు మారిపోతున్నాయని, ఎవరూ ఊహించని విధంగా ఓటింగ్‌ ఉంటుందని, చాలా జాగ్రత్తగా ఆడాలని తెలిపారు. సభ్యులను హెచ్చరించాడు.