Asianet News TeluguAsianet News Telugu

నాగార్జున స్టేట్మెంట్స్ తో 'దేవదాస్'పై అనుమానాలు!

నాగార్జున, నాని హీరోలుగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య 'దేవదాస్' అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

nagarjuna unusual comments irks devadas makers
Author
Hyderabad, First Published Sep 25, 2018, 2:36 PM IST

నాగార్జున, నాని హీరోలుగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య 'దేవదాస్' అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గానే ఉంది. కానీ ఈరోజు ప్రెస్ మీట్ లో హీరో నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ''రెండు రోజుల క్రితమే ఈ సినిమా చూశాను.. ఇంకొంచెం ముందు చూపించి ఉంటే బాగుండేది'' అంటూ నోరు జారాడు.

అలానే ''కనీసం నెల రోజుల ముందు సినిమా చూపిస్తే నిర్మాతలకు మంచిది. శ్రీరామ్ ఆదిత్య ఇక ముందు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే మంచిది'' అని నాగార్జున అన్నారు. తను నటించే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకునే నాగ్ కి ఈ సినిమాలో మార్పులు చేర్పులు చేయడం కుదరలేదు.

సినిమా అవుట్ పుట్ తో సంతృప్తిగా లేని కారణంగా నాగార్జున ఇలాంటి స్టేట్మెంట్ చేశాడని అంటున్నారు. ఏ సినిమా విషయంలోనైనా.. సూటిగా మాట్లాడే నాగ్.. ఇప్పుడు 'దేవదాస్' సినిమా విషయంలో కూడా అదే చేశాడు. మరి నాగ్ స్టేట్మెంట్స్ ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios