ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న సందర్బంగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలందరికి ట్వీట్స్ తో  పలకరిస్తున్న సంగతి తెల్సిందే. స్పోర్ట్స్ , సినిమాలకు సంబందించిన ప్రముఖులను ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ జనాలు ఓటువేసేవిధంగా ఉత్తేజపరచాలని చెబుతున్నారు. 

మొన్న మోహన్ లాల్ - నాగార్జునని ట్యాగ్ చేస్తూ మీ నటనతో ఎన్నో ఏళ్లుగా కోట్ల అభిమానులను అలరిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా మీ వంతు సహాయంగా జనాలను ఉత్తేజపరచండి అని తెలుపగా నాగ్ కొన్ని గంటల క్రితం తన సమాధానాన్ని ఇచ్చారు. 

మోడీ ట్వీట్ లో చెప్పిన విధానానికి ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నాం. తప్పకుండ ఓటు వేసి తమ వంతు బాధ్యతాయుతంగా కృషిచేస్తామని నాగార్జున తనదైన శ్గైలిలో వివరణ ఇచ్చారు.