నేడు(సెప్టెంబర్‌ 20) ఏఎన్నార్‌ జయంతి. ఈ సందర్భంగా నివాళ్లర్పించారు తనయుడు, హీరో నాగార్జున. ఈ సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియోని పంచుకున్నారు. ట్విట్టర్‌ ద్వారా ఈ వీడియోని షేర్‌ చేస్తూ తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యారు.  

లెజెండరీ నటుడు, నటనా బాటసారి ఏఎన్నార్( అక్కినేని నాగేశ్వరరావు) తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగు సినిమాకి రెండు కళ్లలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌గా పిలుచుకుంటున్నారంటే నాగేశ్వరరావు ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. నేడు(సెప్టెంబర్‌ 20) ఏఎన్నార్‌ జయంతి. ఈ సందర్భంగా నివాళ్లర్పించారు తనయుడు, హీరో నాగార్జున. ఈ సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియోని పంచుకున్నారు. ట్విట్టర్‌ ద్వారా ఈ వీడియోని షేర్‌ చేస్తూ తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యారు. 

సెప్టెంబర్‌ 20 తన జీవితంలో ముఖ్యమైన రోజని, తన హీరో, తన స్ఫూర్తి నాన్నగారి పుట్టిన రోజని తెలిపారు. నాన్నగారికి పంచకట్టు అంటే చాలా ఇష్టమని, ఆయన పంచకట్టుకున్నప్పుడల్లా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందన్నారు. ఆయనకు పొందురు ఖద్దరంటే చాలా ఇష్టమని, తాను వేసుకున్నది కూడా పొందురు ఖద్దరే అని, తాను ధరించిన నవరత్నాల హారం కూడా నాన్నదే అని, నవరత్నాల ఉంగరం, ధరించిన వాచ్‌ కూడా ఆయనదే అని చెప్పారు. ఈ వాచ్‌ తనకంటే సీనియర్‌ అని తెలిపారు. 

YouTube video player

నాన్నగారి వాచ్‌ తన ఫేవరేట్‌ అని తెలిపారు. ఇవన్నీ వేసుకుంటే నాన్నగారు తనతోనే ఉన్నట్టు అనిపిస్తుందని, నాన్నగారి పంచకట్టుని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు నాగార్జున. ఈ సందర్భంగా తాను నటిస్తున్న `బంగర్రాజు` పోస్టర్‌ని పంచుకున్నారు. అందులో పంచకట్టులో నాగార్జున కనిపించారు. `బంగార్రాజు` చిత్రంలో తాను ఏఎన్నార్‌ వస్తువులను ధరించి నటించినట్టు తెలిపారు. ఆయన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తుంది.