తెలుగులో బిగ్ బాస్ షో మొదలైనప్పుడు హోస్ట్ గా చాలా మందిని అనుకున్నారు. ఫైనల్ గా ఎన్టీఆర్ ని ఒప్పించి బుల్లితెరపైకి తీసుకొచ్చారు. ఆ విధంగా ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ మరింత పెరిగిపోయారు. కానీ బిగ్ బాస్ సీజన్ 2ని హోస్ట్ చేసే సమయం ఎన్టీఆర్ కి లేకపోవడంతో నానిని తీసుకొచ్చారు. హోస్ట్ గా నాని ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు.

పైగా సోషల్ మీడియాలో అతడిపై నెగెటివ్ ట్రోలింగ్ జరిగింది. దీంతో ఇక జీవితంలో ఆ షో జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యాడు. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 3 మొదలుకానుంది. దీనికి హోస్ట్ గా ఎవరిని తీసుకుంటారనే విషయంలో తర్జనభర్జనలు మొదలయ్యాయి.

మరోసారి ఎన్టీఆర్ కోసం ప్రయత్నించారు. కానీ 'RRR' కారణంగా ఎన్టీఆర్ బిగ్ బాస్ షో చేయడం కుదరడం లేదు. దీంతో తెరపై నాగార్జున పేరు వచ్చింది. 'మీలో ఎవరు కోటీశ్వరుడు'  షోతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన నాగ్ ని బిగ్ బాస్ 3 హోస్ట్ చేయమని అడుగుతున్నారట.

తనకంటూ ఉన్న ప్రత్యేకమైన స్టైల్ తో షోని రక్తికట్టించగలడని నమ్ముతున్నారు. ఈ క్రమంలో నాగార్జునతో చర్చలు జరుగుతున్నాయి. దాదాపు నాగార్జున కన్ఫర్మ్ అనే మాటలు  వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి!