టాలీవుడ్ యువ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా సీనియర్ హీరోల స్పీడ్ ను ఇంకా వారు అందుకోవడం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా నాగ్ ఇప్పుడు సీక్వెల్స్ పై కసి పెంచేసుకున్నాడు. ఎంతగా అంటే రెండు సినిమాల స్క్రిప్ట్ లను ఒకేసారి ఫినిష్ చేయాలనీ టార్గెట్ గా పెట్టుకున్నాడు. నాగ్ ఇటీవల రెండు సీక్వెల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 

సోగ్గాడే చిన్న నాయన కథను బేస్ చేసుకొని బంగార్రాజు స్క్రిప్ట్ ను రెడీ చేశారు.  దర్శకుడు కళ్యాణ్ క్రిష్ నేల టిక్కెట్టు సినిమాతో డిజాస్టర్ అందుకోవడంతో  మొన్నటివరకు ఈ సినిమాపై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక ఫైనల్ గా కళ్యాణ్ కథలో మార్పులు చేసి నాగ్ ని మెప్పించాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. 

ఇక మరోవైపు మన్మథుడు సీక్వెల్ ను కూడా నాగ్ మొదలెట్టడానికి రెడీ అయిపోయాడు. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్స్ లలో నాగ్ బిజీ కానున్నాడు. రాహుల్ రవిచంద్రన్ దర్శకత్వం వహించబోయే ఆ కథపై కూడా నాగ్ చాలా నమ్మకంతో ఉన్నాడు. సోగ్గాడే చిన్ని నాయన తరువాత నాగ్ కి సోలో హిట్ లేదు. దీంతో ఎలాగైనా ఈ సీక్వెల్స్ తో హిట్టుకొట్టాలనే కసిగా ఉన్నాడు ఈ సీనియర్ స్టార్.