నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా సాగిన ది ఘోస్ట్ ట్రైలర్ ఆకట్టుకుంది. విక్రమ్ గా నాగార్జున అదరగొట్టారు.
గరుడవేగ మూవీతో ఇండస్ట్రీని ఆకర్షించాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. రాజశేఖర్ హీరోగా 2017లో విడుదలైన ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఆయన నుండి వస్తున్న మూవీ కావడంతో ది ఘోస్ట్ పై అంచనాలు పెరిగిపోయింది. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా సాగిన ది ఘోస్ట్ ట్రైలర్ ఆకట్టుకుంది. విక్రమ్ గా నాగార్జున అదరగొట్టారు.
ఓ ఫ్యామిలీని కాపాడడం కోసం మిషన్ లో జాయిన్ అయిన ఏజెంట్ నాగార్జున కనిపిస్తున్నారు. మాఫియా మొత్తం దిగగా అడ్డుకునే శక్తిగా ఆయన ఉన్నారు. నాగ్ ఏక్షన్ తో పాటు సోనాల్ చౌహాన్ గ్లామర్ తో ఆకట్టుకున్నారు. రిచ్ లొకేషన్స్ లో అత్యంత ఉన్నంతగా మూవీ తెరకెక్కినట్లు అర్థం అవుతుంది. బంగార్రాజు మూవీతో హిట్ కొట్టిన నాగార్జున ది ఘోస్ట్ తో మరో హిట్ ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా ది ఘోస్ట్ ట్రైలర్ దుమ్మురేపింది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ లో సునీల్ నారంగ్, పూసుకూర్ రామ్ మోహన్ రావ్, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. మార్క్ కె రాబిన్, భరత్, సౌరభ్ సంగీతం అందించారు.
