Asianet News TeluguAsianet News Telugu

ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా... ఎన్టీఆర్ కి నాగ్ ప్రేమపూర్వక ఆహ్వానం!


హైదరాబాద్ వేదికగా బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అతిథిగా రానున్నారు. బ్రహ్మాస్త్రం మూవీలో కీలక రోల్ చేసిన నాగార్జున ఎన్టీఆర్ కి తనదైన శైలిలో ఆహ్వానం పలికారు. 
 

nagarjuna special invitation for ntr to Brahmastra pre release event
Author
First Published Aug 27, 2022, 5:22 PM IST

ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ ఇమేజ్ తారా స్థాయికి చేరింది. అలాగే సౌత్ చిత్రాలు బాలీవుడ్ లో సంచనాలు చేస్తుండగా, బాలీవుడ్ స్టార్స్ సైతం సౌత్ లో పాగా వేసి ఇండియా మొత్తం మార్కెట్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రన్బీర్ కపూర్ సౌత్ మార్కెట్ పై కన్నేశారు. ఆయన రీసెంట్ మూవీ షంషేరా తెలుగు కూడా విడుదల చేశారు. అయితే ఆ మూవీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కరణ్ జోహార్ నిర్మాతగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బ్రహ్మాస్త్రం  మాత్రం సంచలనాలు చేస్తుందని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. 

కాగా సెప్టెంబర్ 9న  వరల్డ్ వైడ్ బ్రహ్మాస్త్రం  గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ మూవీకి భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని గెస్ట్ గా ఆహ్వానించారు. బ్రహ్మాస్త్రం మూవీలో నాగార్జున కీలక రోల్ చేస్తున్నారు. శివుని అస్త్రాల్లో ఒకటిగా ఆయన కనిపించనున్నారు. కావున ఈ మెగా ఈవెంట్ కి నాగార్జున కూడా హాజరు కానున్నారు. ఎన్టీఆర్ తో ఆయన వేదిక పంచుకోనున్నారు. 

బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా వస్తున్న ఎన్టీఆర్ కి నాగార్జున ప్రత్యేక ఆహ్వానం పలికారు. ట్విట్టర్ వేదికగా సెప్టెంబరు 2న నిన్ను కలవాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు కామెంట్ చేశారు. ఎన్టీఆర్ కి అంత ప్రేమగా నాగార్జున వెల్కమ్ చెప్పడం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న బ్రహ్మాస్త్ర మూవీలో అమితాబ్, మౌని రాయ్ కీలక రోల్స్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సైంటిస్ట్ గా గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios