బిగ్‌బాస్‌తోపాటు, నాగార్జున ఆడియెన్స్ ని మరోసారి మోసం చేశారు. ఎలిమినేషన్‌ అంటూ బుకాయించి, నమ్మించి మోసం చేశారు. అఖిల్‌కి షాక్‌ ఇచ్చి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. మూడు రోజుల క్రితం అఖిల్‌ని ఇంటి సభ్యులచే ఎలిమినేట్‌ చేయించిన విషయం తెలిసిందే. తమకి అడ్డు వచ్చే స్ట్రాంగ్‌ మెంబర్‌ని ఎలిమినేట్‌ చేయాలన్న బిగ్‌బాస్‌ ఆదేశాల మేరకు సభ్యులు అఖిల్‌ని ఎలిమినేట్‌ చేశారు. దీంతో ఆయన్ని తీసుకెళ్ళి సీక్రెట్‌ రూమ్‌లో పెట్టాడు. 

అప్పటి నుంచి రహస్యంగా సభ్యుల అసలు స్వరూపాన్ని చూశాడు అఖిల్‌. అయితే శనివారం అఖిల్‌కి నాగ్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు. సభ్యులు ఎలిమినేట్‌ చేసిన కారణంగా అఖిల్‌ని హౌజ్‌ నుంచి పంపించేస్తానని, వస్తువులు సర్దుకుని, సభ్యులతో సెల్ఫీ తీసుకుని స్టేజ్‌మీదకు రమ్మని అఖిల్‌కి చెప్పాడు. ఇలా కూడా ఎలిమినేషన్‌ ఉందని చెప్పాడు. 

ఈ విషయంలో ఇంటి సభ్యులంతా పెద్ద తప్పు చేశారని నాగార్జున అన్నారు. బిగ్ బాస్ కేవలం ఒక్క కండిషన్ మాత్రమే ఇవ్వలేదని.. మూడు కండిషన్స్ ఇచ్చారని నాగార్జున గుర్తుచేశారు. బిగ్ బాస్ ఇచ్చిన కండిషన్లు నాగ్‌ చెబుతూ, మొదట ఈ గేమ్‌లో మీరు ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారనేది, రెండోది హౌజ్‌లో మీ ఆటకు అడ్డం వచ్చేవాళ్లు ఎవరనేది, అలాగే గేమ్‌లో ఫైనల్స్‌కి మీకు అడ్డం వచ్చేవారు ఎవరనేది. కానీ ఇంటి సభ్యులంతా మొదటి కండిషన్‌ను మాత్రమే పట్టుకుని ఎవరికి వారు స్ట్రాంగ్ అని చెప్పుకున్నారని నాగ్‌ తనదైన స్టయిల్‌లో క్లాస్ పీకారు. అఖిల్‌ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మాత్రమే తాము చెప్పామని.. ఆయన్ని ఇంట్లో నుంచి పంపే అర్హత తమకు ఉందో లేదో తెలియదని, తాము అయితే ఆయన్ని పంపరనే అనుకున్నామని చెప్పారు. దీంతో నాగ్‌ సీరియస్‌ అయ్యాడు. బిగ్ బాస్ చెప్పేది మీరు వినరా అంటూ మండిపడ్డాడు. అతన్ని పంపించేస్తున్నానని హెచ్చరించారు. దీంతో వద్దు అంటూ వేడుకున్నారు. ప్రాపర్‌గా సెండాఫ్‌ ఇవ్వాలని తెలిపారు.

నువ్వు ఎలిమినేషనల్‌ అని నాగ్‌ చెప్పగానే అఖిల్‌ షాక్‌ అయ్యాడు. తనని ఇంటికి పంపిస్తారని అనుకోలేదని, ఇలా ఏదో చేస్తారని అనుకున్నానని, కానీ ఎక్కడో చిన్న హోప్‌ ఉందని చెప్పాడు. కానీ నాగ్‌ లేదు ఎలిమినేట్‌ అని చెప్పడంతో అఖిల్‌ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. బ్రతిమాలుకున్నాడు. తప్పైందని వేడుకున్నాడు. కానీ నాగ్‌ వినలేదు. వస్తువులు సర్దుకుని రమ్మని కోపంతో చెప్పాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో అఖిల్‌ హౌజ్‌లోకి వెళ్ళి తాను వెళ్లిపోతున్నానని చెప్పాడు. దీంతో సభ్యులు కూడా షాక్‌ అయ్యారు. 

హౌజ్‌లోకి వెళ్ళి సభ్యులతో సెల్ఫీ తీసుకుని రమ్మని చెప్పాడు. వచ్చే ముందు హౌజ్‌లో సభ్యుల్లో ఫ్రెండ్స్ ఎవరు, నెగటివ్‌ ఎవరు చెప్పమన్నాడు. సోహైల్‌, మోనాల్‌ ప్రెండ్స్ అని చెప్పాడు. తనకు సపోర్ట్ గా ఉన్నాడని, నేను వెళ్లిపోయాక కూడా తనే ఎక్కువ బాధపడ్డాడనని చెప్పాడు. మోనాల్‌ కూడా తాను వెళ్ళిపోయాక చాలా బాధపడిందన్నారు. ఈ సందర్భంగా సోహైల్‌ స్పందిస్తూ తనకు అఖిల్‌ అన్నలాగా ఉన్నాడని, మంచి చెడు చెప్పాడని, బాధలో ఉన్నప్పుడు హగ్‌ ఇచ్చి ఓదార్చాడని సోహైల్‌ చెబుతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. 

ఇక నెగటివ్‌ లిస్ట్ లో అభిజిత్‌, హారిక, లాస్య, మెహబూబ్‌ నెగటివ్‌ అని చెప్పాడు. సింపతి సింపతి అంటూ నీ నిజ స్వరూపం చూపించావని, నా దృష్టిలో చాలా పడిపోయావని అభిజిత్‌ని అన్నాడు. అలాగే సింపతి విషయాన్ని హారికకి కూడా అన్వయించాడు అఖిల్‌. లాస్య కూడా ఇలా చేస్తుందని ఊహించలేదన్నాడు. మెహబూబ్‌ విషయంలో విమర్శలు చేశాడు. కెప్టెన్సీ టాస్క్ లో చేసిన దాన్ని గుర్తు చేసి విమర్శించాడు. అంతా అయిపోయాక బిగ్‌బాస్‌ షాక్‌ ఇచ్చాడు. ఎప్పటిలాగే అఖిల్‌ వెళ్లడం లేదని చెప్పాడు. అంతేకాదు ఓ టాస్క్ ఇచ్చి డైరెక్ట్ కెప్టెన్‌ని చేశాడు. 

మరోవైపు ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన హారిక, అరియానా, మోనాల్‌, మెహబూబ్‌, అభిజిత్‌, సోహైల్‌లో ఎవరు సేఫ్‌ అనే విషయంలో నామినేషన్‌కి ఇచ్చిన సీసాలతోనే కొట్టుకోవాలని చెప్పగా, ఇందులో అభిజిత్‌ సేవ్‌ అయ్యాడు.